close

తాజా వార్తలు

కొడుకు కాలికి గొలుసుకట్టి మరీ..

పెషావర్‌: చెప్పిన పని చేయట్లేదనో.. లేక మానసిక పరిస్థితి సరిగా లేదనో తెలియదు గానీ కన్న కొడుకు పట్ల కఠినంగా ప్రవర్తించాడో తండ్రి. తాను నడిపే దుకాణంలోనే కాలికి ఇనుప గొలుసు కట్టి ఆ బాలుడితో పనులు చేయించాడు. పాకిస్థాన్‌లోని పెషావర్‌లో జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెళితే..

పెషావర్‌లోని నసీర్‌పుర్‌ ప్రాంతానికి చెందిన సర్దార్‌ఖాన్‌ స్థానికంగా టీ దుకాణం నడుపుతున్నాడు. ఇటీవల ఈ దుకాణంలో ఓ బాలుడు కాలికి ఇనుప గొలుసులతో పనిచేస్తున్న వీడియో, ఫొటోలు వైరల్‌ అయ్యాయి. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తొలుత ఆ బాలుడు పనివాడని అనుకున్నారు. అయితే విచారణలో ఆ చిన్నారి సర్దార్‌ఖాన్‌ కొడుకేనని తేలింది. పోలీసులు ఆ బాలుడిని విడిపించి అతడి కుటుంబానికి అప్పగించారు. కొడుకు నిర్బంధించినందుకు గానూ సర్దార్‌ఖాన్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. పూచీకత్తు సమర్పిస్తే అతడిని న్యాయస్థానం విడిచిపెట్టే అవకాశముందని తెలిపారు. 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.