
తాజా వార్తలు
హైదరాబాద్: వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసులో విజయవాడకు చెందిన కోగంటి సత్యమే ప్రధాన సూత్రధారి అని పశ్చిమ మండలం డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. రుణ భారం తగ్గించినా అప్పు తీర్చలేదన్న అక్కసుతోనే ఈ హత్య చేయించినట్లు తెలిపారు. మొత్తం ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని, మరో ఆరుగురి కోసం గాలిస్తున్నామని చెప్పారు. రాంప్రసాద్ హత్య కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ సోమవారం మీడియాకు వెల్లడించారు.
రాం ప్రసాద్, కోగంటి సత్యం ఇద్దరూ 2003 నుంచి కలిసి వ్యాపారం కలిసి చేశారు. వ్యాపార లావాదేవీల్లో భాగంగా రూ.70 కోట్లు రాంప్రసాద్ కోగంటి సత్యానికి బకాయిపడ్డాడు. ఈ వివాదం పెద్దల వద్దకు వెళ్లడంతో రూ.23 కోట్లు చెల్లించాల్సిందిగా సెటిల్ చేశారు. రుణమొత్తం భారీగా తగ్గించినా రాంప్రసాద్ అప్పు తీర్చలేదని కోగంటి సత్యం ఆగ్రహంతో ఉన్నాడు. దీంతో రాంప్రసాద్‌ను హతమార్చాలని కోగంటి సత్యం నిర్ణయానికొచ్చాడు. శ్యామ్, మరో ఇద్దరు కలిసి రాంప్రసాద్‌ను హత్య చేశారు. హత్య ఎవరు చేసినా నిందితుడు, ప్రధాన సూత్రధారి కోగంటి సత్యమేనని డీసీపీ వెల్లడించారు. తనపై ఎవరికీ అనుమానం రాకుండా రాంప్రసాద్‌ను హత్య చేయించాలని కోగంటి సత్యం భావించాడని, అందుకే పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేశాడని చెప్పారు. ఈ కేసులో ఆరుగురు నిందితుల్లో కోగంటి సత్యం, శ్యామ్, ప్రసాద్, ప్రీతమ్, రామును అరెస్ట్ చేశామని చెప్పారు. కోగంటి సత్యంతో గొడవల వల్లే రాంప్రసాద్ విజయవాడ వదిలి హైదరాబాద్‌కు వచ్చారని తెలిపారు. ఈ హత్యకు రూ.10లక్షలు సుపారీ ఇచ్చేందుకు కోగంటి అంగీకరించినట్లు తెలిసిందన్నారు. దాడి జరిగిన ప్రదేశంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దాడికి ఉపయోగించిన బొలెరో వాహనాన్ని గుర్తించామన్నారు. ప్రధాన నిందితుడైన కోగంటి సత్యంపై ఇప్పటికే పలు పోలీస్టేషన్లలో 21 కేసులు ఉన్నాయని డీసీపీ వెల్లడించారు.
పక్కదోవ పట్టించేందుకు స్కెచ్..
హత్య జరిగిన తర్వాత కేసును తప్పదోవ పట్టించేందుకు తాను తిరుపతి వెళ్లానని కోగంటి సత్యం మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. కేసు తనమీదకు రాకుండా శ్యామ్, ప్రసాద్, రామును లొంగిపోవాలని సూచించాడు. దీంతో కేసు క్లోజ్ అవుతుందనుకున్నాడు. శ్యామ్ కూడా మీడియాతో, పోలీసులకు ఈ హత్యకి కోగంటి సత్యంకి సంబంధం లేదని పలుమార్లు చెప్పడంతో పోలీసుల అనుమానం మరింత పెరిగింది. ఆ కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. రాంప్రసాద్ నుంచి రావల్సిన డబ్బు రావకపోవడంతో అతడిని హత్య చేస్తే అతడి బావమరిది ఇవ్వవలసిన రూ.12 కోట్లు అయినా వస్తాయని ఆశపడి కోగంటి సత్యం ఈ హత్య చేయించాడని పోలీసులు వివరించారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- ఫేస్బుక్ సాయంతో కన్నవారి చెంతకు
- ‘దిశ’ హత్యాచార కేసు నిందితుల మృతదేహాలు తరలింపు
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- ఆదాయపు పన్ను తగ్గిస్తారా?
- ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు
- విచారణ ‘దిశ’గా...
- సైన్యంలో చేరిన కశ్మీరీ యువత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
