close

తాజా వార్తలు

హైబ్రిడ్‌ సైకిల్‌.. గంటకు 130 కిలోమీటర్లు!

ఇంటర్నెట్‌డెస్క్‌ : సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్ది నూతన ఆవిష్కరణలు పురుడు పోసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కర్ణాటకలోని గుల్బార్గాలో  ఓ డిగ్రీ విద్యార్థి తన తండ్రి కోసం హైబ్రిడ్‌ సైకిల్‌ను తయారు చేశాడు. పెడల్‌, బ్యాటరీ, ఇంధనం మూడు విధాలుగా గంటలకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సైకిల్‌కు రూపకల్పన చేశాడు. ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్న ఆ సైకిల్‌ను బెంగళూరులో ఓ సాంకేతిక సంస్థ త్వరలోనే మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

కర్ణాటకలోని గుల్బార్గా జిల్లా చిత్తాపూర్‌లో బీఎస్సీ ఎలక్ట్రానిక్స్‌ చదువుతున్న విద్యార్థి అజయ్‌కుమార్ ఆవిష్కరణ ఈ సైకిల్‌.‌  26 ఏళ్ల నుంచి తన తండ్రి వ్యవసాయ పనులకు, ప్రయాణాలకు వినియోగించిన సైకిల్‌ పాడై పోయింది. అయితే దీన్ని ఓ మూలన పడేశారు. అప్పుడే అజయ్‌ సైకిల్‌పై ప్రయోగం చేసి ద్విచక్రవాహనంగా మార్చాలనుకున్నాడు. ఆ పాత సైకిల్‌కే ఇంజిన్‌, లిథియం బ్యాటరీని అమర్చి ఇంటర్నెట్‌కు అనుసంధానం చేశాడు. మూడు విధాలుగా సైకిల్‌పై ప్రయాణించేలా రూపకల్పన చేశాడు. ఈ సైకిల్‌ను తొక్కడంతోపాటు బ్యాటరీ సహాయంతో నడపవచ్చు. బ్యాటరీ డౌన్‌ అయితే ఇంధనంతో ప్రయాణించవచ్చు. శబ్ద, వాయు కాలుష్యం లేకుండా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో హైబ్రిడ్‌ సైకిల్‌పై ప్రయాణించవచ్చు.  

అజయ్‌కుమార్‌ తయారు చేసిన ఈ సైకిల్‌ను చూసిన బెంగళూరులోని అసెంట్‌ ఇంజినీరింగ్‌ టెక్నాలజీ కంపెనీ వినియోగంలోకి తెచ్చేందుకు ముందుకు వచ్చింది. ఎలక్ట్రానిక్స్‌, పరిశ్రమల్లో వృథాగా పడిఉన్న వస్తువులను తిరిగి పునర్‌ వినియోగంలోకి తెచ్చే ఈ సంస్థ.. హైబ్రిడ్‌ సైకిల్‌కు అండగా నిలుస్తోంది.  గ్రామీణ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు , ఐటీ కారిడార్లు ఎక్కువగా వినియోగంలోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్‌లోని ఇండియా సాఫ్ట్‌ సదస్సులో వివిధ ఐటీ సంస్థలకు పరిచయం చేశారు.

అజయ్‌కుమార్‌ తయారు చేసిన  హైబ్రిడ్‌ ఈ సైకిల్‌కు మరింత మెరుగులు అద్ది మార్కెట్‌లోకి తీసుకురావాలని అసెంట్‌ సంస్థ యోచిస్తోంది.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.