close

తాజా వార్తలు

అయ్యప్పల బస్సు బోల్తా.. ఒకరి మృతి

అయ్యప్పల బస్సు బోల్తా.. ఒకరి మృతి

కొత్తపల్లి,(తూర్పుగోదావరి): శబరిమల యాత్ర ముగించుకొని తిరిగివస్తుండగా మంగళవారం రాత్రి తమిళనాడులోని తిరుచ్చి సమీపంలో బస్సు బోల్తాపడి ఒకరు మృతిచెందగా పలువురికి గాయాలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలంలోని కొత్తపల్లి, వాకతిప్ప గ్రామాలకు చెందిన 40మంది అయ్యప్పమాలదారులు ఈ నెల 2న మండపేట గోపీకృష్ణ ట్రావెల్స్‌కి చెందిన బస్సులో శబరిమలకు బయలుదేరారు. వారు తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో వాకతిప్ప గ్రామానికి చెందిన అయిశెట్టి సూర్యావతి(52) మృతిచెందింది. సుమారు 30 మందికి గాయాలయ్యాయి. వారంతా తమిళనాడులోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ఈ ఘటనతో ఇరు గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.