close

తాజా వార్తలు

ఆ రాత్రి తలచుకుంటేనే రక్తం మరిగిపోతోంది!

బహిరంగ శిక్షలు అమలు చేయాలి: పవన్‌

హైదరాబాద్‌: దిశ కేసు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన ఘటనపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. హైదరాబాద్‌ శివారులో ఇటీవల దిశపై జరిగిన దారుణం మన ఆడపడుచుల రక్షణకు ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోవని హెచ్చరిస్తోందని అన్నారు. ఆ ఘటన జరిగిన రాత్రి నలుగురు ముష్కరుల మధ్య దిశ ఎంత నరకాన్ని చూసిందో తలచుకుంటేనే ఆవేశం, ఆక్రోశం, ఆవేదనతో రక్తం మరిగిపోతోందని పేర్కొన్నారు. యావత్‌ జాతి తక్షణ న్యాయం కోరుకోవడానికి కారణం ఇలాంటి ఆవేదనేనన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌తో ఇలాంటి ఘటనలు ముగిసిపోయాయని అనుకోవద్దన్నారు. మహిళలపై దారుణాలకు పాల్పడేవారిని వదిలిపెట్టకూడదన్నారు. దేశంలో మరే ఆడబిడ్డకూ ఇలాంటి పరిస్థితి రాకూడదని పవన్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి కేసుల్లో కోర్టులపరంగా తక్షణ న్యాయం లభించాలని కోరారు. రెండు, మూడు వారాల్లోనే దోషులకు శిక్షలు పడేలా నిబంధనలు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఆడపడుచుల శ్రేయస్సు దృష్ట్యా శిక్షలు బహిరంగంగా అమలు చేసే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. నేరాల స్థాయిని బట్టి అది మరణ శిక్ష అయినా, మరే ఇతర శిక్ష అయినా సరే బహిరంగంగా అమలు జరపాలని ఆయన అభిప్రాయపడ్డారు.  

‘‘నిర్భయ ఉదంతం తరువాత బలమైన చట్టాన్ని మన పార్లమెంట్‌ తీసుకొచ్చింది. అయినా అత్యాచారాలు ఆగలేదు. అంటే ఇంకా మరింత కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ఇలాంటి ఘటనలు తెలుపుతున్నాయి. ఆడపిల్లల వైపు వక్రబుద్ధితో చూడాలంటేనే భయపడే విధంగా కఠిన చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇతర దేశాల్లో ఎలాంటి చట్టాలు ఉన్నాయో అధ్యయనం చేయాలి. ఇందుకోసం మేధావులు ముందుకు రావాలి. వారి ఆలోచన శక్తితో ఇటువంటి నికృష్ట ఘాతుకాలకు చరమగీతం పాడాలి. ప్రజలు కోరుకున్న విధంగా దిశ ఉదంతంలో సత్వర న్యాయం లభించింది. ఈ సందర్భంగా దిశ ఆత్మకు శాంతి కలగాలని, ఈ విషాదం నుంచి ఆమె తల్లిదండ్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’’ అని పవన్‌ పేర్కొన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.