
తాజా వార్తలు
మ్యూజిక్ డైరెక్టర్ అనూ మాలిక్
ముంబయి: హిందీలో ప్రసారమయ్యే రియాల్టీ షో ‘ఇండియన్ ఐడిల్ సీజన్ 11’ నుంచి తాను తప్పుకోవడం లేదని మ్యూజిక్ డైరెక్టర్ అనూ మాలిక్ తెలిపారు. గత కొన్నిరోజుల నుంచి ట్విటర్ వేదికగా ఆయన ‘మీటూ’ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో ఇండియన్ ఐడిల్ న్యాయనిర్ణేత స్థానం నుంచి అనూ మాలిక్ తప్పుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.
దీనిపై స్పందించిన అనూ మాలిక్.. షో నుంచి తాను తప్పుకోవడం లేదని, కాకపోతే మూడు వారాల పాటు షో కు దూరంగా ఉంటున్నానని తెలిపారు. ‘‘షో నుంచి నేను తప్పుకోవడం లేదు. కాకపోతే మూడు వారాలపాటు షో నుంచి విరామం తీసుకోనున్నాను. నా మీద వస్తున్న ‘మీటూ’ ఆరోపణల గురించి ఇన్‌స్టా వేదికగా నేను సమాధానం చెప్పాను. అవన్నీ అవాస్తవాలని నేను చెప్పినప్పటికీ నా మీద ట్విటర్ వేదికగా కొందరు కావాలనే ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. వీటివల్ల నేను బాగా విసిగిపోయాను. ఈ ఆరోపణలన్నీ చెరిపేసుకున్నాకే నేను మళ్లీ తిరిగి నా పనిలోకి వెళ్లాలనుకుంటున్నాను. అలా చేయడం ప్రతి ఒక్కరికి మంచిదని నేను భావిస్తున్నాను’’ అని అనూ మాలిక్ అన్నారు.
‘‘సోనీ టీవీ వారు నన్ను ఎప్పుడూ ‘ఇండియన్ ఐడిల్’ నుంచి తప్పుకోవాలని చెప్పలేదు. మొదటి నుంచి వాళ్లు నాకెంతో మద్దతుగా ఉన్నారు. గతేడాది ‘మీటూ’ ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు నేనే ఆ షో నుంచి తప్పుకున్నాను. వాళ్లకి నా మీద నమ్మకం ఉంది కాబట్టే ఈ ఏడాది మరోసారి నన్ను న్యాయనిర్ణేతగా తీసుకున్నారు. ‘మీటూ’ ఆరోపణల వల్ల ఈ 42 ఏళ్ల నేను అందించిన గొప్ప సంగీతాన్ని గురించి ప్రజలు మర్చిపోయారు. ఈ ఆరోపణలు నన్ను ఎంతగానో బాధపెట్టాయి. నన్ను చీకట్లోకి నెట్టేశాయి. ట్విటర్ వేదికగా నేను వారిపై యుద్ధం చేయాలనుకోవడం లేదు. దేవుడు ఉన్నాడు. నాపై ఆరోపణలు చేస్తున్న వారికి సరైన సమాధానం చెబుతాడు’’ అని ఆయన తెలిపారు.
తమను వేధింపులకు గురిచేస్తున్నారంటూ సినీ పరిశ్రమకు చెందిన మహిళలు సోషల్‌మీడియా వేదికగా చేపట్టిన ఉద్యమం ‘మీటూ’. ఇందులో భాగంగా గతేడాది అనూ మాలిక్ తమను వేధింపులకు గురిచేశారంటూ సింగర్స్ నేహ బాసిన్, శ్వేత పండిట్, సోనా మహపాత్ర ఆరోపణలు చేశారు. దీంతో ఆయన ఆ ఏడాది ఇండియన్ ఐడిల్-10 నుంచి తప్పుకున్నారు. తాజాగా ఆయన మరోసారి ఈ ఏడాది ఇండియన్ ఐడిల్-11కు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. దీంతో మరోసారి ట్విటర్ వేదికగా ఆయన మరోసారి మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ‘ఎలక్షన్.. ఎలక్షన్‌కి పవర్ కట్ అయిపోద్ది రా..’
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- సానియా మీర్జాతో చరణ్ చిందులు
- హీరోయిన్లను పిలవగానే బాలయ్య ఏం చేశారంటే..
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోను: మమత
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- ‘ఆ నిర్ణయంకాంగ్రెస్ హైకమాండ్ కోర్టులో ఉంది’
- ‘చావు కబురు చల్లగా’ చెబుతానంటున్న కార్తికేయ
- వ్రతాలలోనూ వ్యక్తిత్వ వికాసం!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
