close

తాజా వార్తలు

విజయ్‌ ఆంటోని ‘జ్వాల’

చెన్నై: ‘బిచ్చగాడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు నటుడు విజయ్‌ ఆంటోని. ఈ సినిమాతో ఆయన అటు కోలీవుడ్‌తోపాటు ఇటు టాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం విజయ్‌ కథానాయకుడిగా తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అగ్ని సిరగుల్‌’. ఈ సినిమాని తెలుగులో ‘జ్వాల’ పేరుతో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. నవీన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్షర హాసన్‌ కథానాయికగా నటిస్తున్నారు. విజయ్‌ ఆంటోనీ శీను అనే పాత్రలో కనిపించనున్నారు. యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని చాలా సన్నివేశాలను మాస్కో, రష్యా, కజకిస్థాన్‌ ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు. ప్రకాష్‌ రాజ్‌, అరుణ్‌ విజయ్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. నటరాజన్‌ శంకరన్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.