close

తాజా వార్తలు

‘జార్జిరెడ్డి రేపు మళ్లీ పుడతాడు’

హైదరాబాద్‌: జార్జిరెడ్డి రేపు మళ్లీ పుడతాడని ‘జార్జిరెడ్డి’ చిత్ర దర్శకుడు జీవన్‌రెడ్డి తెలిపారు. 25 ఏళ్లకే విద్యార్థి నాయకుడిగా ఎదిగి, ఎందరికో స్ఫూర్తి దాయకంగా మారిన జార్జిరెడ్డి జీవితాన్ని ఆధారం చేసుకుని తెరకెక్కిన చిత్రం ‘జార్జిరెడ్డి’. జీవన్‌రెడ్డి దర్శకుడు. నవంబర్‌ 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం ఈ చిత్రబృందం నారాయణగూడలోని క్రైస్తవ స్మశానవాటికలో జార్జ్‌రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించింది. అనంతరం ఈ చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. ‘25 ఏళ్లకే ఒక విద్యార్థి నాయకుడిగా ఎదిగి, ఎందరికో స్ఫూర్తిగా మారారు జార్జిరెడ్డి. ఆయన జీవితాన్ని గురించి ప్రతి ఒక్కరికి తెలియ చేసేందుకే ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఆయన నిజాయితీని ప్రజలకు మరింత దగ్గర చేయడమే లక్ష్యంగా రెండేళ్లు పాటు కష్టపడి ఈ సినిమా తెరకెక్కించాం. జార్జిరెడ్డి లాంటి ఎందరో వ్యక్తులను ఈ సమాజం కోల్పోయింది. ఆయన రేపు మళ్లీ పుడతాడు. ఆయన చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి’ అని అన్నారు.

1970వ దశకంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి నేతగా ఎదిగిన జార్జిరెడ్డి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘వంగవీటి’ ఫేం సందీప్‌ కుమార్‌ టైటిల్‌ పాత్రలో నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినీ ప్రముఖులు సైతం ‘జార్జిరెడ్డి’ చిత్రం గురించి సోషల్‌మీడియా వేదికగా తమ స్పందనలను తెలుపుతున్నారు.

 

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.