
తాజా వార్తలు
ముంబయి: తన తండ్రి కృష్ణరాజ్ రాయ్‌ను గుర్తు చేసుకున్నారు బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్. ఆయన జయంతి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా బుధవారం ఐష్ ఓ పోస్ట్‌ను పెట్టారు. ‘మన డే ఆఫ్ స్మైల్స్.. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను నాన్న. హ్యాపీ బర్త్‌డే’ అని ఐష్ పేర్కొన్నారు. డే ఆఫ్ స్మైల్స్ సంస్థలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నారులతో కలిసి ఐష్ తన తండ్రికి నివాళులర్పించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టా వేదికగా ఆమె అభిమానులతో పంచుకున్నారు. మరోవైపు అభిషేక్ సైతం ఇన్‌స్టా వేదికగా కృష్ణరాజ్ రాయ్‌ను మిస్ అవుతున్నానంటూ పోస్ట్ పెట్టారు.
గతేడాది విడుదలైన ‘ఫ్యానీఖాన్’ చిత్రంలో ఐష్ నటించారు. ప్రస్తుతం ఆమె మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నారు. కల్కి రచించిన ‘పొన్నియిన్ సెల్వన్’ పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో ఐష్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ సినిమాలో మోహన్‌బాబు, కార్తీ, జయంరవి, విక్రమ్, కీర్తి సురేశ్, అమితాబ్‌బచ్చన్, అనుష్క నటించబోతున్నట్లు సమాచారం.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- ఫేస్బుక్ సాయంతో కన్నవారి చెంతకు
- ‘దిశ’ నిందితుల మృతదేహాలు తరలింపు
- ఆదాయపు పన్ను తగ్గిస్తారా?
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు
- సైన్యంలో చేరిన కశ్మీరీ యువత
- ఎన్కౌంటర్ స్థలిని పరిశీలించిన ఎన్హెచ్ఆర్సీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
