
తాజా వార్తలు
ఎన్నో ఏళ్లు శ్రమించా.. ఒక్కో ఇటుక పేర్చా..!
బెంగళూరు: ‘కేజీఎఫ్’ సక్సెస్‌తో కథానాయకుడు యశ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. 2018 డిసెంబరు 8న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.250 కోట్లు రాబట్టినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అంతర్జాతీయంగానూ ఈ సినిమాను ఇష్టపడ్డారు.. దీంతో కన్నడ చిత్ర పరిశ్రమ స్థాయి మరింత పెరిగింది. కన్నడంలోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ చిత్రం ఘన విజయం సాధించింది. యశ్‌కు స్టార్ హీరో ఇమేజ్ దక్కింది. అయితే ఈ ఇమేజ్ ఒక్కరోజులో వచ్చింది కాదని, ఎన్నో ఏళ్ల శ్రమని ఆయన పేర్కొన్నారు.
‘కేవలం ఒక్క సినిమా ఓ వ్యక్తి తలరాతను మార్చదు. అది ప్రక్రియ.. ఓ వ్యక్తి ఎన్నో ఏళ్లు పడ్డ శ్రమ ఒక్కసారిగా తెరపైకి వస్తుంది. రాత్రికి రాత్రే నేను స్టార్ అయిపోలేదు. ఒక్కో ఇటుక పేర్చి.. నా కెరీర్‌ను నిర్మించుకున్నాను. ‘కేజీఎఫ్’కు ముందు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను, కష్టపడ్డాను. ఈ సినిమా సక్సెస్ నా గమ్యం కాదు, విశ్రాంతి తీసుకునే ఉద్దేశం లేదు. సాధారణంగా నా సినిమా థియేటర్‌కు వచ్చేంత వరకు నేను మాట్లాడుతుంటా. ఒక్కసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడను. సినిమా హిట్ అందుకుంటే కూడా నోరువిప్పను. ఎందుకంటే.. అది నా ఏకాగ్రతను దెబ్బతీస్తుంది’ అని యశ్ ఓ ఆంగ్లపత్రికతో చెప్పారు.
అనంతరం తనను చూడటానికి ఫిలిప్పిన్స్ నుంచి బెంగళూరుకు వచ్చిన అభిమాని గురించి యశ్ మాట్లాడుతూ.. ‘అతడు నా ఇంగ్లిషు ఇంటర్వ్యూలు చూసి ఇంప్రెస్ అయ్యాడు. నా పాత సినిమాల్ని సబ్‌టైటిల్స్‌తో చూశాడు. ‘కేజీఎఫ్’ సమయంలో నేనిచ్చిన ఇంటర్వ్యూలు కూడా చూశాడట. అతడికి కన్నడ ఎలా అర్థమైందో నాకు అర్థం కావడం లేదు, ఆశ్చర్యమేసింది. అతడు నన్ను కలిసినప్పుడు కొన్ని డైలాగ్‌లు కూడా చెప్పాడు. నా కోసం స్వీట్స్ తీసుకొచ్చాడు. అలాంటి అభిమానుల్ని కలవడం మా బాధ్యత’ అని పేర్కొన్నారు.
2008లో కన్నడ సినిమా ‘మొగిన మనసు’తో యశ్ కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత అనేక సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన నేపథ్య గాయకుడిగానూ అలరించారు. 2018లో వచ్చిన ‘కేజీఎఫ్’ ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. యశ్ ప్రస్తుతం ‘కేజీఎఫ్’కు కొనసాగింపుగా తీస్తున్న ‘కేజీఎఫ్ 2’లో నటిస్తున్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ‘ఎలక్షన్.. ఎలక్షన్‌కి పవర్ కట్ అయిపోద్ది రా..’
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- సానియా మీర్జాతో చరణ్ చిందులు
- హీరోయిన్లను పిలవగానే బాలయ్య ఏం చేశారంటే..
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోను: మమత
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- ‘ఆ నిర్ణయంకాంగ్రెస్ హైకమాండ్ కోర్టులో ఉంది’
- ‘చావు కబురు చల్లగా’ చెబుతానంటున్న కార్తికేయ
- వ్రతాలలోనూ వ్యక్తిత్వ వికాసం!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
