close

తాజా వార్తలు

నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది: మహేశ్‌

హైదరాబాద్‌: తన ముద్దుల కుమార్తె సితారను చూస్తుంటే చాలా గర్వంగా ఉందని సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు అన్నారు. హాలీవుడ్‌లో మంచి గుర్తింపు సాధించిన చిత్రం ‘ఫ్రోజన్‌’. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘ఫ్రోజన్‌ 2’ను తెరకెక్కింది. నవంబర్‌ 22న ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు. అయితే తెలుగులో రాబోతున్న ‘ఫ్రోజన్‌ 2’ చిత్రంలో చిన్నప్పటి ఎల్సా పాత్రకు మహేశ్‌ కుమార్తె వాయిస్‌ అందించిన విషయం తెలిసిందే. మరో రెండు రోజుల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ఎదుటకు రాబోతున్న నేపథ్యంలో సోషల్‌మీడియా వేదికగా మహేశ్‌ ఓ పోస్ట్‌ పెట్టారు.

‘ఎల్సా చిన్నప్పటి పాత్రలో సితార ఒదిగిపోయింది. తను చాలా నమ్మకంగా, మ్యాజికల్‌గా, స్వచ్ఛంగా ఆ పాత్రకు వాయిస్‌ అందించింది. సితూ పాపా నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నవంబర్‌ 22 కోసం ఎంతగానో ఎదరుచూస్తున్నాను’ అని మహేశ్‌ అన్నారు.

ప్రస్తుతం మహేశ్‌.. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న  ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మహేశ్‌కు జంటగా రష్మిక అలరించనున్నారు. అలనాటి తార విజయశాంతి ప్రొఫెసర్‌ భారతిగా కనిపించనున్నారు. ఈ నెల 22న ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.