
తాజా వార్తలు
ఇంటర్నెట్‌డెస్క్: వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కెరీర్లో ముందుకు సాగే యువ కథానాయకుల్లో నిఖిల్ ఒకరు. ‘స్వామిరారా’, ‘కార్తికేయ’, ‘కేశవ’, ‘ఎక్కడికీ పోతావు చిన్నవాడా’ చిత్రాలతో తానేంటో నిరూపించుకున్నారు. టి.సంతోషన్ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అర్జున్ సురవరం’. ‘ముద్ర’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం ఆ తర్వాత టైటిల్ మార్చుకుంది. అంతేకాదు, ఈ ఏడాది వేసవిలో విడుదల కావాల్సిన ఈ సినిమా అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా, ఈనెల 29న ‘అర్జున్ సురవరం’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా నిఖిల్ ట్విటర్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం..
ప్రతిసారీ ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తూ విజయాలను సొంతం చేసుకోవడం ఎలా సాధ్యమవుతోంది?
నిఖిల్: అన్ని సార్లు విజయం సాధించలేదు. కొన్నిసార్లు ప్రయోగాలు విజయవంతమవుతాయి. మరికొన్నిసార్లు కాకపోవచ్చు. అయితే, అలాంటి వాటిలో నటించినప్పుడు ఆత్మ సంతృప్తి కలుగుతుంది.
పక్కా హిట్ కొట్టే ప్రమోషన్స్ కావాలి..
నిఖిల్:హిట్ అనేది ప్రమోషన్స్ కంటే సినిమా కంటెంట్, ఆడియన్స్ చేతుల్లోనే ఉంటుంది.
‘అర్జున్ సురవరం’ బడ్జెట్ ఎంత?
నిఖిల్: సినిమాను ఠాగూర్ మధు చాలా గ్రాండ్‌గా తీశారు. సినిమా కోసం ఇంత పెట్టుబడి పెట్టిన ఆయనకు కృతజ్ఞతలు.
మీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటారు? పాత్రల కోసం ఏ విధంగా మారతారు? అలాంటి సమయాల్లో మీ మానసిక స్థితి ఎలా ఉంటుంది?
నిఖిల్: కొన్ని సందర్భాల్లో శారీరకంగా, మానసికంగా చాలా ఒత్తిడికి గురవుతా. ముఖ్యంగా అర్జున్ సురవరం విడుదల ఆలస్యం కావడం కూడా ప్రభావం చూపింది. అయితే, నా స్నేహితులు, కుటుంబం నాకు ఎంతో అండగా నిలిచారు.
ఈ ఫొటోను గుర్తు పట్టారా?
నిఖిల్: ఇది హ్యాపీడేస్ 100 రోజుల వేడుక సందర్భంగా దిగిన ఫొటో. తారక్ భాయ్‌ను నేరుగా చూడటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది.
‘కేశవ’లాంటి ఇంటెన్స్ డ్రామాలో మీరు నటించాలి. అలాగే ప్రతినాయక ఛాయలున్న పాత్రను పోషిస్తే చూడాలని ఉంది.
నిఖిల్: తప్పకుండా మీ సూచనను గుర్తు పెట్టుకుంటా. ‘కేశవ’ ఇప్పటికే చేశా కదా! మళ్లీ ఎందుకు? ఇంకేదైనా ప్రయత్నిద్దాం.
‘అర్జున్ సురవరం’ మళ్లీ వాయిదా పడదు కదా!
నిఖిల్: హహ్హహ్హ.. అందరూ అడిగిదే.. ఈసారి పక్కాగా నవంబరు 29న విడుదలవుతుంది.
లావణ్య త్రిపాఠితో పనిచేయడం ఎలా అనిపించింది?
నిఖిల్: నిజంగా తను దేవత.
‘కార్తికేయ’ కొనసాగిస్తారా? లేక కొత్త స్టోరీ ఉందా?
నిఖిల్: ఇది నిజంగా సీక్వెల్. అవే పాత్రలు. ఆ కథకు కొనసాగింపుగా ఉంటుంది.
ఈ సినిమా ఇంత ఆలస్యం కావడానికి కారణం ఏంటి?
నిఖిల్: ఆ విషయాన్ని ట్విటర్లో వివరించలేను. కానీ, ఆర్థిక సమస్యల కారణంగా ఇది ఆగిపోయిందని అందరూ అనుకుంటున్నారు. ఓ చిన్న వివాదం అంతే. అది సమసిపోయింది.
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పండి?
నిఖిల్: వెండితెరపై మిమ్మల్ని మిస్ అవుతున్నాం సర్.
ఈ సినిమాలో వెన్నెల కిషోర్ పాత్ర ఏంటి?
నిఖిల్: ఎప్పటిలాగే కాకా చంపేశాడు. ఇందులో ఆయన బాలాజీ అనే పాత్రలో కనిపిస్తారు.
ఈ సినిమాలో మీకు కష్టం అనిపించింది ఏంటి?
నిఖిల్: హహ్హహ్హ.. దర్శకుడు చెప్పినవన్నీ చేయడం కష్టంగానే అనిపించాయి. ఈ పోస్టర్లో కనిపిస్తున్న సీన్ కోసం రెండు గంటల పాటు కారు బయట వేలాడుతూ ఉన్నా.
నిఖిల్ గురించి ఒక్క మాటలో..
నిఖిల్: బాబూ.. చిట్టీ..
‘అర్జున్ సురవరం’ మూవీ కాన్సెప్ట్ ఏంటి?
నిఖిల్: ఒక పెద్ద సమస్య విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులపైనా ప్రభావం చూపుతుంది. ట్రైలర్ చూస్తే మీకే అర్థమవుతుంది.
కార్తికేయ, స్వామిరారాలాంటి చిత్రాలు మీ నుంచి వస్తాయా?
నిఖిల్: కార్తికేయ సీక్వెల్ తప్పకుండా వస్తుంది. ‘స్వామిరారా’ గురించి సుధీర్వర్మను అడగండి.
అర్జున్ సురవరం గురించి ఒక్క మాటలో..
నిఖిల్: మా చిత్ర బృందమంతా నిజాయతీగా పనిచేసింది. అందరూ ఈ సినిమాను చూడండి.
నేపథ్య సంగీతం ఎలా ఉంటుంది?
నిఖిల్: శ్యామ్ సీఎస్ చక్కని నేపథ్య సంగీతాన్ని ఇచ్చారు. ఇటీవల ‘ఖైదీ’తో ఆయన మిమ్మల్ని అలరించారు. ఇప్పుడు ‘అర్జున్ సురవరం’లో కూడా అదే స్థాయి నేపథ్య సంగీతం ఉంటుంది.
నిద్రలేవగానే మీరు చేసే మొదటి పని?
నిఖిల్: నా ఫోన్ చెక్ చేసుకోవడం.
ప్రభాస్ గురించి ఒక్క మాటలో చెప్పండి?
నిఖిల్: హీ ఈజ్ ద మ్యాన్... లవ్
మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు?
నిఖిల్: సినిమా విడుదలైన తర్వాత ఈ ప్రశ్నకు సమాధానం చెబుతా.
ఈ సినిమా ఒప్పుకోవడానికి అసలు కారణం ఏంటి?
నిఖిల్: మనందరికీ ఎదురయ్యే నిజమైన సమస్యను ఇందులో చూపించబోతున్నాం. ఇది ఎంటర్టైన్మెంట్తో కూడిన సోషల్ కాన్సెప్ట్ చిత్రం.
మీకు డేట్స్ లేనప్పుడు పవన్‌కల్యాణ్‌తో నటించే అవకాశం వస్తే ఏం చేస్తారు?
నిఖిల్: నేను పనిచేసే చిత్ర నిర్మాతకు నా సొంత డబ్బులు ఇచ్చి, పవన్‌కల్యాణ్ చిత్రానికి డేట్స్ ఇస్తా.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ఇక పీఎఫ్ తగ్గించుకుని.. జీతం పెంచుకోవచ్చా..!
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- సంజుకు.. కోహ్లీసేనకు.. చావోరేవో
- భాజపాకు తెరాస షాక్!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
