
తాజా వార్తలు
ముచ్చటగా మూడోసారి కలిసిన హీరోలు-దర్శకులు
బోయపాటి-బాలయ్య, అల్లు అర్జున్-త్రివిక్రమ్, రామ్-కిషోర్ తిరుమల ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో క్రేజీ కాంబినేషన్లు టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అంతేకాదు, బాక్సాఫీస్ వసూళ్లను కూడా కొల్లగొట్టాయి. మొదటిసారి కలిసి పనిచేస్తే క్రేజీగా అనిపించే ఈ కాంబినేషన్, రెండోసారి అంచనాలను పెంచేస్తుంది. మరి ముచ్చటగా మూడోసారి చేతులు కలిపితే ఆ అంచనాలు ఒకటి కాదు.. రెండు కాదు.. మూడింతలవుతాయి. మరి రాబోయే రోజుల్లో ప్రేక్షకులను అలరించనున్న ఈ హ్యాట్రిక్ వీరులపై ఓ లుక్కేయండి..!
బాబూ! రెడీయా.. కెమెరా.. యాక్షన్..
బోయపాటి శ్రీను.. ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేది పవర్ఫుల్ డైలాగులు, యాక్షన్ సన్నివేశాలే. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు. ఆయన డైరెక్షన్‌కు బాలకృష్ణ యాక్షన్ తోడైతో అది ప్రేక్షకులకు స్పెషల్ ఫీస్ట్ అనే చెప్పాలి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వీటిల్లో బాలయ్య ద్విపాత్రాభినయంలో కనిపించి మెప్పించారు. అంతేకాకుండా ఈ చిత్రాల్లో ఆయన చెప్పిన పవర్ఫుల్ డైలాగులకు నందమూరి అభిమానులు ఫిదా అయ్యారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. త్వరలో వీరిద్దరి కాంబినేషన్లో మూడో చిత్రం పట్టాలెక్కనుంది. బాలయ్యతో త్వరలో సినిమా చేయనున్నట్లు దర్శకుడు బోయపాటి ఇప్పటికే ప్రకటించిన విషయంలో తెలిసిందే. మరి ఆ చిత్రంలో బాలకృష్ణ ఎలా కనిపించనున్నారో వేచి చూడాలి.
‘అల.. వైకుంఠపురములో’ ఏం జరిగింది?
‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలు అల్లు అర్జున్ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ రెండు చిత్రాల్లో బన్నీ తండ్రి మాటను నెరవేర్చే కుమారుడి పాత్రలో కనిపించారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ చిత్రంగా ‘అల.. వైకుంఠపురములో..’ తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. మరి ఇందులో బన్నీ పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలంటే జనవరి 12వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే.
‘రెడ్’ పడిందెవరికి?
వరుస వైఫల్యాల తర్వాత రామ్‌కి ఓ ఎనర్జీనిచ్చిన చిత్రం ‘నేను శైలజ’. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్ సింపుల్, క్లాస్ లుక్‌లో కనిపించి అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టాడు. ఇదే కాంబినేషన్లో 2017లో విడులైన చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’. స్నేహానికి మంచి అర్థాన్ని చెప్పిన ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ అలరించింది. ఇందులో రామ్ కొంచెం విభిన్నమైన లుక్‌లో కనిపించారు. గడ్డం, హెయిర్ స్టైల్ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకున్నాయి. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న మూడో సినిమా ‘రెడ్’. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమాలో రామ్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్లు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
మూడోసారి ‘అష్టాచమ్మా’ఆట
‘అష్టాచమ్మా’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నటుడు నాని. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. చలాకీతనం, చిలిపితనం కలగలిపిన హీరోగా నాని తన మొదటి చిత్రంతోనే ప్రేక్షకులకు చేరువయ్యారు. 2016లో విడుదలైన ‘జెంటిల్మన్’ లాంటి థ్రిల్లింగ్ చిత్రంతో నానిలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు దర్శకుడు మోహన్ కృష్ణ. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడో చిత్రం ‘వి’. ‘ఈ సినిమాతో కావాల్సినంత వైలెన్స్‌ను ప్రేక్షకులకు చూపిస్తా’నని అంటున్నారు నాని. మరి ఇందులో ఆయన పాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. సుధీర్ బాబు-నాని కలిసి నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఉగాదికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈసారి ఏ లెక్కతో వస్తున్నారు?
అల్లుఅర్జున్లో కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం ‘ఆర్య’. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మరో లవ్ మేజికల్ చిత్రం ‘ఆర్య 2’. ఈ రెండు సినిమాల్లోనూ గీత ప్రేమ కోసం పరితపించే ప్రేమికుడి పాత్రలో అల్లు అర్జున్ నటన అందరికీ గుర్తుండిపోతుంది. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో ముచ్చటగా మూడో చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. మరి ఇందులో లెక్కల మాస్టారు బన్నిని ఎలా చూపిస్తారో చూడాలి.
‘క్రాక్’పుట్టిస్తారట!
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డాన్ శ్రీను’. ఈ సినిమా ద్వారా గోపీచంద్ మలినేని దర్శకుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రెండో చిత్రం ‘బలుపు’. ఈ రెండు సినిమాలతో రవితేజ మంచి విజయాన్ని అందుకున్నారు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ మూడో చిత్రంగా ‘క్రాక్’ తెరకెక్కుతుంది. ఇందులో రవితేజను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా చూపించనున్నారు దర్శకుడు గోపీచంద్.
-ఇంటర్నెట్‌డెస్క్
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ఇక పీఎఫ్ తగ్గించుకుని.. జీతం పెంచుకోవచ్చా..!
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- సంజుకు.. కోహ్లీసేనకు.. చావోరేవో
- భాజపాకు తెరాస షాక్!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
