close

తాజా వార్తలు

ప్రతిక్షణం నాకెంతో నచ్చింది: గల్లా అశోక్‌

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్‌ కుమారుడు గల్లా అశోక్‌ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతున్న విషయం తెలిసిందే. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. శనివారంతో ఈ సినిమా షూటింగ్‌ మొదటి షెడ్యూల్‌ పూర్తయింది. దీంతో శ్రీరామ్‌ ఆదిత్య సోషల్‌మీడియా వేదికగా చిత్రబృందంతో కలిసి దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ‘విజయవంతంగా మేము మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకున్నాం. గల్లా జయదేవ్‌ ఈ రోజు సెట్స్‌కు రావడం మాలో మరింత ఉత్సాహాన్ని నిప్పింది. చాలా మంచి చిత్రబృందం. లవ్‌ యూ ఆల్‌.’ అని శ్రీరామ్‌ పేర్కొన్నారు. ఈ ట్వీట్‌పై స్పందించిన అశోక్‌ గల్లా ట్విటర్‌ వేదికగా.. ‘ప్రతిక్షణం నాకెంతో బాగా నచ్చింది.’ అని అన్నారు. ఈ సినిమాలో అశోక్‌కు జంటగా నిధి అగర్వాల్‌ నటించనున్నారు. జిబ్రాన్‌ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.