
తాజా వార్తలు
నటి శ్రీరెడ్డి
కోడంబాక్కం, న్యూస్‌టుడే: నటుడు ఉదయనిధిపై తాను ఆరోపణలు చేసినట్లు వచ్చిన ఫేస్బుక్ పోస్టులో నిజం లేదని, అది తాను పెట్టిన పోస్టు కాదని నటి శ్రీరెడ్డి పేర్కొన్నారు. అసలు ఉదయనిధిని తాను ఎప్పుడూ నేరుగా చూడలేదన్నారు. ఉదయనిధిపై నటి శ్రీరెడ్డి ఆరోపణలు చేసినట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై వివరణ ఇవ్వడానికి ఆమె చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘కరుణానిధి కుటుంబంపై నాకు గౌరవ మర్యాదలు ఉన్నాయి. ఉదయనిధిని నేను నేరుగా చూసిన సందర్భం లేదు. ఆయన గురించి వచ్చిన పోస్టు.. నా ఫేస్బుక్ ఖాతాది కాదు. అది ఓ నకిలీ ఖాతా. ఎవరో పనిగట్టుకుని అలా చేశారు. ఉదయనిధి పేరు ప్రతిష్ఠలను దెబ్బతీయాలని చేస్తున్న చర్యలివి. నా పేరిట సామాజిక మాధ్యమాల్లో పలు నకిలీ ఖాతాలు ఉన్నాయి. దీనికి సంబంధించి సైబర్ క్రైంలో ఫిర్యాదు చేశా. చాలా మంది కథానాయికలు చిత్ర పరిశ్రమలో లైంగిక పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. దానిపై బాహాటంగా ఆరోపణలు చేసినప్పటికీ నాకు మద్దతు దక్కలేదు. ఇప్పుడు తమిళ ప్రజలు ఆదరిస్తున్నారు. త్వరలోనే ఇక్కడ రాజకీయ ప్రవేశం చేయనున్నా. తమిళ ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నా. నేను తప్పులు చేశా. ప్రస్తుతం వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నా. అవకాశాల కోసం పలు తప్పులు చేశా. ఇకపై అలా జరగవని’ పేర్కొన్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- ఫేస్బుక్ సాయంతో కన్నవారి చెంతకు
- ‘దిశ’ నిందితుల మృతదేహాలు తరలింపు
- ఆదాయపు పన్ను తగ్గిస్తారా?
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు
- సైన్యంలో చేరిన కశ్మీరీ యువత
- ఎన్కౌంటర్ స్థలిని పరిశీలించిన ఎన్హెచ్ఆర్సీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
