
తాజా వార్తలు
హైదరాబాద్: విలక్షణ నటుడు కమల్ హాసన్ కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న ‘భారతీయుడు 2’ సినిమాలో నటించే అవకాశం కోల్పోయానని బాలీవుడ్ నటుడు విద్యుత్ జామ్వాల్ తెలిపారు. ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. కాజల్, రకుల్‌ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. కమల్ సినీ కెరీర్లో మైలురాయిగా నిలిచిన ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
కాగా ఇందులో విద్యుత్ నటించబోతున్నారని తొలుత వదంతులు వచ్చాయి. ఆపై చిత్ర బృందం ఆయన పేరును అధికారికంగా ప్రకటించలేదు. దీంతో ఆ ఆవార్తల్లో నిజం లేదని అనుకున్నారు. అయితే తనకు సినిమాలో అవకాశం వచ్చిందని విద్యుత్ తాజాగా మీడియాతో అన్నారు. ‘తొలుత నన్ను ‘భారతీయుడు 2’లో నటించమని అడిగారు. కానీ ‘ఖుదా హఫీజ్’ చిత్రం కోసం అప్పటికే సంతకం చేశా. అందువల్లే ‘భారతీయుడు 2’లో నటించే గొప్ప అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందటూ’ అని చెప్పారు. మరోపక్క శృతి హాసన్, విద్యుత్ కలిసి ‘పవర్’ సినిమాలో నటించబోతున్నారు. మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం విద్యుత్ ‘కమాండో 3’ చిత్రంలో నటిస్తున్నారు. డిసెంబర్ 29న ఈ సినిమా విడుదల కాబోతోంది.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ‘ఎలక్షన్.. ఎలక్షన్‌కి పవర్ కట్ అయిపోద్ది రా..’
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- సానియా మీర్జాతో చరణ్ చిందులు
- హీరోయిన్లను పిలవగానే బాలయ్య ఏం చేశారంటే..
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోను: మమత
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- ‘ఆ నిర్ణయంకాంగ్రెస్ హైకమాండ్ కోర్టులో ఉంది’
- ‘చావు కబురు చల్లగా’ చెబుతానంటున్న కార్తికేయ
- వ్రతాలలోనూ వ్యక్తిత్వ వికాసం!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
