close

తాజా వార్తలు

అక్కడ ‘తమ్ముడు’.. ఇక్కడ‘దొంగ’..!

చెన్నై: కార్తి, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘తంబి’. ఈ సినిమాను తెలుగులో ‘తమ్ముడు’ టైటిల్‌తో విడుదల చేయబోతున్నారని అనేక వార్తలు వచ్చాయి. చివరికి ఈ సినిమాకి ‘దొంగ’ అనే పేరును ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు దర్శక, నిర్మాతలు. శుక్రవారం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. తమిళంలో ‘తంబి’ టైటిల్‌ను ఖరారు చేసిన చిత్ర బృందం.. తెలుగులో మాత్రం ‘దొంగ’ టైటిల్‌ను నిర్ణయించారు. ఫస్ట్‌లుక్‌లో కార్తి, జ్యోతిక ముఖాలు సగం సగం మాత్రమే కనపడుతున్నాయి. అక్క, తమ్ముడి సెంటిమెంట్‌తో ఈ సినిమాను తీస్తున్నట్లు తెలుస్తోంది. ‘దృశ్యం’ ఫేం జోసెఫ్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. శనివారం టీజర్‌ను విడుదల చేయబోతున్నారట.

కార్తి ఇటీవల ‘ఖైదీ’ సినిమాతో మంచి విజయం అందుకున్నారు. తక్కువ బడ్జెట్‌తో విభిన్న కథగా వచ్చిన ఈ సినిమాకు ప్రశంసలు దక్కాయి. ప్రత్యేకించి కార్తి నటనను విమర్శకులు, ప్రముఖులు మెచ్చుకున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.