close

తాజా వార్తలు

ప్రతిసారీ మరణం ముగింపు కాదు..!

ఉత్కంఠగా ‘ది బాడీ’ ట్రైలర్‌

ముంబయి: ‘ప్రతిసారీ మరణం ముగింపు కాదు.. ’ అంటోంది ‘ది బాడీ’ చిత్ర బృందం. ప్రముఖ నటుడు రిషి కపూర్, ఇమ్రాన్‌ హష్మీ, శోభితా ధూళిపాళ, వేదిక ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇది. జీతూ జోసెఫ్‌ దర్శకుడు. డిసెంబరు 13న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

శుక్రవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. మర్డర్‌ మిస్టరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ఇమ్రాన్‌ తన సతీమణి, వ్యాపారవేత్త శోభితాను చంపేందుకు ప్రయత్నించినట్లు ట్రైలర్‌ బట్టి అర్థమౌతోంది. మార్చురీలో ఓ శవం చుట్టూ ఈ కథ సాగనున్నట్లు తెలుస్తోంది. రిషి కపూర్‌ పోలీసు అధికారిగా కనిపించారు. ఉత్కంఠ సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ ప్రచార చిత్రాన్ని రూపొందించారు. గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న రిషి, ఇమ్రాన్‌ ఈ చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం విశేషం.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.