
తాజా వార్తలు
ముంబయి: ప్రముఖ నేపథ్య గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమె కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. లత ఆరోగ్య విషయంలో అనవసర పుకార్లు సృష్టించవద్దని వారు విజ్ఞప్తి చేశారు. ‘‘లతా దీదీ అరోగ్యం నిలకడగా ఉంది. అమె కోలుకుంటున్నారు. మీ ఆదరాభిమానాలకు, చేసిన ప్రార్థనలకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అని లతా మంగేష్కర్ ట్విటర్ ఖాతా నుంచి ప్రకటన వెలువడింది.
‘‘నేను లత కుటుంబ సభ్యులతో మాట్లాడాను. అమె కోలుకుంటున్నారు. ఆధారం లేని పుకార్లకు ప్రచారం కల్పించడం మాని, ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి’’ అని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్ ట్వీట్ చేశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న లతకు ముంబయి బ్రీచ్ కాండీ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. న్యుమోనియా, ఛాతిలో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆమె కోలుకుంటున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- రాహుల్‌పై ఈసీకి భాజపా ఫిర్యాదు
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
- బుడ్డోడి బ్యాటింగ్‌కి కోహ్లీ ఫిదా!
- ధోనీ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు అందుకే!
- పాఠశాల బస్సు దగ్ధం: విద్యార్థులు సురక్షితం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
