close

తాజా వార్తలు

అదృష్టం బాగుంది.. ప్రమాదం తప్పింది!

హైదరాబాద్‌: ‘ప్ర‌స్థానం’ నుంచీ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న యువ కథానాయకుడు సందీప్‌ కిషన్‌. కెరీర్‌లో ఒడుదొడుకులు ఏ కథానాయకుడికైనా సర్వ సాధారణమే. సందీప్‌ విషయంలోనూ అదే జరిగింది. హిట్లూ.. ఫట్లూ రెండూ చూశారాయన. ఆ ఫ‌లితాల‌నే పాఠాలుగా చేసుకుంటూ, త‌న కెరీర్‌ని తానే పునర్‌ నిర్మించుకుంటున్నాడు. ఇటీవ‌ల నిర్మాత‌గానూ మారాడు. ‘నినువీడ‌ని నీడ‌ను నేనే’తో ఓ మంచి విజ‌యాన్ని అందుకున్నాడు. ఇప్పుడు ‘తెనాలి రామ‌కృష్ణ బిఏ బీఎల్’ అంటూ నవ్వులు పంచడానికి వస్తున్నాడు. శుక్ర‌వారం ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా సందీప్ కిష‌న్ విలేకరులతో మాట్లాడారు. 

‘నిను వీడని నీడను నేను’తో కాస్త భయపెట్టారు.. మళ్లీ కామెడీ బాట పట్టారేంటి?
సందీప్‌ కిషన్‌: ‘వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్’ తర్వాత పూర్తి వినోదాత్మక చిత్రం చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు ఈ చిత్రంతో వచ్చింది. ఈ సినిమా చూస్తున్నంత‌సేపూ న‌వ్వుతూనే ఉంటారు. ద్వితీయార్ధం అయితే... వినోదాల డోసు మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది. యాక్ష‌న్ సన్నివేశాల‌కూ చోటుంది.

నాగేశ్వరరెడ్డితోనే చేయడానికి కారణం ఏంటి?
సందీప్‌ కిషన్‌: జి.నాగేశ్వ‌ర‌రెడ్డి వినోదాత్మ‌క చిత్రాల నిపుణుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయ‌న గ‌త చిత్రాలు బాగా ఆడ‌లేదు. కానీ, అంత‌కు ముందు ఆయ‌న‌కు మంచి విజ‌యాలున్నాయ‌న్న సంగ‌తి మ‌ర్చిపోకూడ‌దు. ప్ర‌తీ చిన్న విష‌యాన్నీ చాలా నిశితంగా గ‌మ‌నిస్తుంటారాయ‌న‌. అందుకే స‌న్నివేశాల‌న్నీ ప‌క‌డ్బందీగా వ‌చ్చాయి.

ప్రత్యేకంగా ఈ సినిమానే చేయడానికి కారణం?

సందీప్‌ కిషన్‌: కామెడీ జోన‌ర్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ మ‌ధ్య సీరియ‌స్ సినిమాలు చేస్తూ వ‌చ్చాను. మ‌ళ్లీ కామెడీ చేయ‌డం ఆనందాన్నిచ్చింది. కాక‌పోతే... సంపూర్ణ వినోదాత్మ‌క క‌థ‌లు ఈ మ‌ధ్య రావ‌డం లేదు. చాలా అరుదుగానే దొరుకుతున్నాయి. అలాంటి క‌థ న‌న్ను వెదుక్కుంటూ రావ‌డం నా అదృష్టం. ఒక్క‌టి మాత్రం చెప్ప‌గ‌ల‌ను.. ఇంత కామెడీ ఇది వ‌ర‌కెప్పుడూ చేయ‌లేదు.

మీకెరీర్‌ను ఎలా ప్లాన్‌ చేసుకుంటున్నారు?
సందీప్‌ కిషన్‌: నాలుగైదు సినిమాల వ‌ర‌కూ నా కెరీర్‌ని బాగానే ప్లాన్ చేసుకున్నాను. ఆ త‌ర‌వాత న‌న్ను కెరీరే న‌డిపించుకుంటూ వెళ్లింది. ఇక మీద‌ట మ‌ళ్లీ నా కెరీర్‌ని నేనే నిర్మించుకోవాల‌నుకుంటున్నాను. ఏ సినిమా త‌ర‌వాత ఎలాంటి క‌థ ఎంచుకోవాలి? రెండు సినిమాల మ‌ధ్య ఎంత విరామం రావాలి? ఎప్పుడు ఎలాంటి జోన‌ర్ చేయాలి..?  ఇలాంటి వ‌న్నీ చాలా జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసుకుంటున్నా.

షూటింగ్‌ సమయంలో గాయపడినట్టున్నారు?
సందీప్‌ కిషన్‌: అవును! ఓ ఫైట్ సీక్వెన్స్‌లో గ్లాస్ బ్లాస్ట్ చేయాల్సి వ‌చ్చింది. అలాంటి సంద‌ర్భంలో ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా చిన్నపాటి గాయాలు అవ్వ‌డం స‌హ‌జ‌మే. ఓ గాజు ముక్క నా కంటి కింది భాగంలో గుచ్చుకుంది. అదృష్టం బాగుంది. కంట్లో గుచ్చుకుంటే చాలా ప్ర‌మాదం జ‌రిగేది.

మీ తర్వాత సినిమాలు ఏంటి?
సందీప్‌ కిషన్‌: ప్ర‌స్తుతం తెలుగు సినిమాల‌పైనే దృష్టి సారిస్తున్నా. త‌మిళం, హిందీ సినిమాల గురించి ఆలోచించ‌డం లేదు. ‘ఏ 1’ అనే చిత్రం త్వ‌ర‌లోనే  సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఇందులో హాకీ ప్లేయ‌ర్‌గా క‌నిపిస్తా. అందుకోసం క‌స‌ర‌త్తులు కూడా ప్రారంభించా.Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.