
తాజా వార్తలు
హైదరాబాద్: సందీప్ మాధవ్, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘జార్జిరెడ్డి’. జీవన్‌రెడ్డి దర్శకత్వం వహించారు. విద్యార్థి సంఘ నాయకుడు జార్జిరెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్ర ట్రైలర్ చూసిన సీనియర్ నటుడు నాగబాబు చిత్ర బృందాన్ని అభినందిస్తూ ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. త్వరలోనే వారిని కలవనున్నట్లు తెలిపారు.
‘ఇటీవల నేను రోడ్డుపై వెళ్తుంటే, ‘జార్జిరెడ్డి’ పోస్టర్లు కనపడ్డాయి. ఆసక్తిగా అనిపించి ఆ చిత్ర ట్రైలర్ చూశా. జార్జిరెడ్డి ఉస్మానియాలో ఓ విద్యార్థి అన్న సంగతి తెలుసు. ఆయన గురించి చాలా ఏళ్లుగా వింటూనే ఉన్నా. ఆ పాత్రను మా కల్యాణ్‌బాబుతో గానీ, లేదా మా అబ్బాయి వరుణ్‌తో గానీ చేయిస్తే ఎలా ఉంటుందని నేను చాలా సార్లు ఆలోచించా. కానీ, ఈలోగా జీవన్‌రెడ్డి ఆ కథతో సినిమా తీసేశారని చాలా సంతోషించా. ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత అలాంటి పాత్రకు బాగా పేరున్న నటుడు అయితే అంతగా సరిపోడని నాకు అనిపించింది. సందీప్ మాధవ్ ఇప్పటివరకూ చిన్న చిన్న పాత్రలే చేశాడు. దాంతో జార్జిరెడ్డి పాత్రకు చక్కగా సరిపోయాడు. జార్జిరెడ్డి ఒక లెజండరీ స్టూడెంట్. అందుకే ఆయనంటే మాకు ఇష్టం. ఫిజిక్స్‌లో గోల్డ్ మెడలిస్ట్. అప్పట్లోనే ఆయనకు ఇస్రోలో ఉద్యోగం వస్తే చేరలేదట. అప్పటి పరిస్థితులను చక్కదిద్దేందుకు, విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం అవన్నీ వదులుకుని పని చేసిన వ్యక్తి’’
‘‘ఆయన కేవలం మేధావి మాత్రమే కాదు.. రియల్ హీరో.. అవసరమైతే 20మందిని ఒక్కడే కొట్టగలడు. రియల్ లైఫ్ బాక్సర్. అనేక రకాల విద్యల్లో ప్రావీణ్యం ఉంది. తను అనుకుంటే అడవుల్లోకి వెళ్లి పోరాటం చేసేవాడు. కానీ, సమాజంలో ఉండి, సమస్యలపై పోరాడాడు. ఒక లెజండరీ స్టూడెంట్ గురించి అందరికీ తెలియాలనే నా ఛానల్ ద్వారా ఈ విషయాలను పంచుకుంటున్నా. ఇప్పుడున్న యువత ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. జార్జిరెడ్డి సినిమా చూడాలని చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. 25 కత్తిపోట్లు తిని కూడా, ప్రాణాలు దక్కించుకుని తిరిగి మళ్లీ సమస్యలపై పోరాటం చేసిన వ్యక్తి ఆయన. అలాంటి గొప్పవాడిని కొన్ని శక్తులు మట్టుబెట్టాయి. జార్జిరెడ్డి బతికి ఉంటే తప్పకుండా ఏదో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేవాడు. ఆయనకు ఆ లక్షణాలు ఉన్నాయి. జార్జిరెడ్డి ఫొటోలను చూస్తున్నప్పుడల్లా మా పవనే నాకు గుర్తొస్తాడు. ఆయన వ్యక్తిత్వం, ఎమోషన్స్ పవన్‌లో కనిపిస్తాయి. అందుకే మా తమ్ముడిని ఇష్టపడతాను. జార్జిరెడ్డి జెండాలో పిడికిలి గుర్తు ఉంటుంది. అదే జనసేన జెండాలోనూ ఉండటం నిజంగా యాదృచ్ఛికం. త్వరలోనే జార్జిరెడ్డి చిత్ర బృందాన్ని కలుస్తా. మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే.. అందరూ ఈ చిత్రాన్ని చూడండి. చాలా బయోపిక్‌లు వచ్చాయి. అసలు బయోపిక్ అంటే ఇది. హ్యాట్సాఫ్ జార్జిరెడ్డి.’’ అని నాగబాబు చెప్పుకొచ్చారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘జార్జిరెడ్డి’ నవంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు పవన్‌కల్యాణ్ హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- నలుదిశలా ఐటీ
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- సీఎం సర్.. మా నాన్నకు జీతం పెంచండి!
- బాపట్లలో వింత శిశువు జననం
- ఒక కాలు పోయినా.. పాకిస్థాన్‌పై ఆడతా
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- కోహ్లీ అరుదైన రికార్డుకు రోహిత్ పోటీ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
