
తాజా వార్తలు
దర్శకుడు విజయ్‌చందర్
కోడంబాక్కం, న్యూస్‌టుడే: ‘వాలు’ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి విజయ్‌చందర్. ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా ‘సంగ తమిళన్’ చిత్రాన్ని తెరకెక్కించారు. నివేదాపెత్తురాజ్, రాశీఖన్నా కథానాయికలు. సూరి హాస్య పాత్ర పోషించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ విజయ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ నెల 15న విడుదల కానుంది. గ్రామీణ అందాలు, అంశాలు నిండిన మాస్ కమర్షియల్ చిత్రంగా దీన్ని రూపొందించారు. తెలుగులో ‘విజయ్ సేతుపతి’గా ఈ చిత్రం ఏకకాలంలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్‌చందర్ ‘న్యూస్‌టుడే’తో చెప్పిన విశేషాలు..
ప్ర: విజయ ప్రొడక్షన్స్‌లో పనిచేయడం ఎలా అనిపించింది?
జ: విజయ ప్రొడక్షన్స్ ప్రత్యేకతలు, గొప్పతనం గురించి నాకు బాగా తెలుసు. ‘సంగ తమిళన్’ కథను చెప్పిన వెంటనే నిర్మాతకు ఈ కథ నచ్చేసింది. వెంటనే తెరకెక్కిద్దామనుకున్నారు. గొప్ప విషయం ఏమిటంటే.. ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదనే నిర్ణయానికి వచ్చేశారు. అదే ఈ సినిమాకు దక్కిన తొలి విజయంగా భావిస్తున్నా.
ప్ర: తెలుగులో ‘విజయ్ సేతుపతి’ అని పేరు పెట్టడానికి కారణం ఏమిటి?
జ: ఇందులో విజయ్ సేతుపతి ద్విపాత్రాభినయం పోషిస్తున్నారు. విజయ్ ఒకరు, సేతుపతి మరొకరు. తమ గ్రామం అంటే ఎనలేని ఇష్టం ఓ పాత్రకి. నగర వాసిగా ఇంకో పాత్రలో మరొకరు కనిపిస్తారు. అందుకే తెలుగులో ‘విజయ్ సేతుపతి’ అని పేరు పెట్టాల్సి వచ్చింది. కథ ప్రకారం పెట్టామే కానీ దీనికి వేరే కారణమేమీ లేదు. ఈ చిత్రంలో విజయ్‌సేతుపతి నటన హైలెట్‌గా ఉంటుంది. పక్కా కమర్షియల్ ప్యాకేజీ అంటే ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
ప్ర: రాజకీయాలను టచ్ చేసినట్లున్నారు?
జ: చాలా ఎక్కువగానే టచ్ చేశాం. పొరుగు ప్రాంతంలో ఉద్యోగం లభించినా తన ఊరి కోసం పోరాడే విజయ్ సేతుపతి పాత్రను చూస్తే కొన్ని వాస్తవ ఘటనలు గుర్తుకొస్తాయి. రాష్ట్రంలో చోటుచేసుకున్న కొన్ని ముఖ్యమైన ఘటలను ఇందులో ప్రస్తావించాం. ప్రతి ఊరిలోనూ విజయ్ సేతుపతి వంటి ఓ యువకుడు ఉంటే.. రాష్ట్రమంతా సంతోషంగా ఉంటుందనే విషయాన్ని కమర్షియల్ అంశాలతో చెప్పాం. ఇది సందేశాత్మక చిత్రం కూడా.
ప్ర: సెన్సార్‌లో ‘కట్’లు ఏమైనా వచ్చాయా?
జ: ఇది రాజకీయ, సమాజ అవగాహన చిత్రమే అయినప్పటికీ సెన్సార్‌లో ఎలాంటి సమస్యలు రాలేదు. ‘కట్’లు కూడా లేవు. ‘తేన్మొళి’ అనే బలమైన పాత్రలో నివేదా పెత్తురాజ్ నటించింది. నగర కథలో రాశీఖన్నా ప్రధాన పాత్ర పోషించారు. అంతేకాకుండా ఇందులో నాజర్ చాలా కీలకమైన పాత్రలో కనిపిస్తారు.
ప్ర: ఇతర నటీనటుల గురించి?
జ: సూరి కొత్త బాడీ లాంగ్వేజ్‌లో ప్రేక్షకులను కనువిందు చేస్తారు. రవికిషన్ విలన్ పాత్ర పోషించారు. ఇతను భోజ్‌పురి చిత్రాల్లో ప్రముఖ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన అక్కడి ఎంపీ కూడా. అశోక్రాణా మరో విలన్.
ప్ర: సినిమాలో ఇతర ప్రత్యేకతలేమిటి?
జ: సెంటిమెంట్, ఎమోషన్, ప్రేమ, హాస్యం కలగలిసిన పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ కమర్షియల్ చిత్రమిది. విజయ్ సేతుపతి చెప్పిన రాజకీయ పంచ్‌లు, కౌంటర్లకు మంచి స్పందన ఉంటుందని నమ్ముతున్నాం. ఈ చిత్రంలో ఆయన ఇమేజ్ వేరే లెవల్‌కు చేరుతుంది. ఇందులో ఐదు పోరాట సన్నివేశాలు, ఐదు పాటలు ఉన్నాయి. చెన్నై, హైదరాబాద్, కారైక్కుడి, పొల్లాచ్చి, కుట్రాలం సహా పలు ప్రాంతాల్లో మొత్తం 85 రోజుల పాటు చిత్రీకరించాం.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- రాహుల్‌పై ఈసీకి భాజపా ఫిర్యాదు
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
- బుడ్డోడి బ్యాటింగ్‌కి కోహ్లీ ఫిదా!
- ధోనీ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు అందుకే!
- పాఠశాల బస్సు దగ్ధం: విద్యార్థులు సురక్షితం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
