close

తాజా వార్తలు

సూర్య.. ‘ఆకాశం నీ హద్దురా’!

ఫస్ట్‌లుక్‌ విడుదల

హైదరాబాద్‌: తమిళ కథానాయకుడు సూర్య, దర్శకురాలు సుధా కొంగర ప్రసాద్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి చిత్ర బృందం ‘ఆకాశం నీ హద్దురా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఆదివారం ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను యూనిట్‌ సభ్యులు విడుదల చేశారు. ఈ చిత్రం కోసం ఆయన మరింత ఫిట్‌గా తయారైనట్లు తెలుస్తోంది. ఫస్ట్‌లుక్‌లో చొక్కా లేకుండా నల్లని బనియన్‌తో అభిమానులకు ట్రీట్‌ ఇచ్చారు. ఇప్పటికే ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. సామాన్యుడికి సైతం విమాన సౌకర్యం అందించిన కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవితాధారంగా రూపొందుతున్న చిత్రం ఇది. ప్రముఖ నటుడు మోహన్‌ బాబు ఇందులోని ప్రత్యేక పాత్రను పోషిస్తున్నారు.

2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అపర్ణ బాలమురలి కథానాయిక. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. కాలీ వెంకట్, కారుణాస్, ప్రతాప్ పోతన్, పరేశ్ రావల్, వివేక్ ప్రసన్న తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.