close

తాజా వార్తలు

మ‌హేశ్‌బాబు బాటలో ఎన్టీఆర్‌

హైదరాబాద్‌: అగ్ర క‌థానాయ‌కులు నిర్మాత‌లుగానూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ఈ జాబితాలో చేరారు. మహేశ్‌బాబు, రామ్‌ చరణ్‌, నాని, విజయ్‌ దేవరకొండ తదితరులు నిర్మాణ రంగంలోనూ సత్తాచాటుతున్నారు. మ‌హేశ్‌ సొంత సంస్థను స్థాపించి, చిత్ర నిర్మాణంలో భాగ‌స్వామ్యం తీసుకుంటున్నారు. ప్రభాస్ చేతిలో యూవీ క్రియేష‌న్స్ ఉంది. ఇప్పుడు ఈ జాబితాలో ఎన్టీఆర్ కూడా చేర‌బోతున్నట్లు స‌మాచారం. త్వరలోనే ఆయన సొంత నిర్మాణ సంస్థను స్థాపించబోతున్నట్లు తెలుస్తోంది.

మ‌హేశ్‌లానే ఇకపై త‌న సినిమాల‌ నిర్మాణంలో పాలు పంచుకునే దిశ‌గా ఎన్టీఆర్‌ అడుగులు వేస్తున్నారట. ఓ మంచి రోజు చూసుకుని నిర్మాణ సంస్థకు సంబంధించిన ప్రకట‌న చేసే అవ‌కాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే ఎన్టీఆర్‌ స్పందించాల్సిందే. ప్రస్తుతం ఆయన ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ‘కేజీఎఫ్‌’ ఫేం ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించనున్న సినిమాలో నటించనున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.