close

తాజా వార్తలు

రవితేజ కొత్త చిత్రం.. రీమేక్‌ కాదు..!

హైదరాబాద్‌: మాస్‌ మహారాజా రవితేజ ప్రస్తుతం ‘డిస్కోరాజా’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం సెట్స్‌పై ఉండగానే ఆయన గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో కొత్త సినిమా చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ‘ఆర్‌.టి.66’(వర్కింగ్‌ టైటిల్‌) పేరుతో సెట్స్‌పైకి వెళ్లబోతున్న ఈ చిత్రంలో రవితేజ పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. ‘డాన్‌ శ్రీను’, ‘బలుపు’ వంటి హిట్‌ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది.

తమిళంలో మంచి విజయం సాధించిన ‘తెరీ’ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని అందుకు తగ్గట్టుగానే రవితేజ పోలీస్‌గా దర్శనమివ్వబోతున్నారని వార్తలొచ్చాయి. అయితే తాజాగా ఇటువంటి రూమర్స్‌పై చిత్ర దర్శకుడు గోపీచంద్‌ మలినేని స్పందించారు. ఇది ఏ చిత్రానికి రీమేక్‌ కాదని, వాస్తవ సంఘటనలు ఆధారంగా చేసుకుని ఈ కథను తెరకెక్కిస్తున్నట్లు ఆయన చెప్పారు. అంతేకాకుండా ఈ చిత్రంలో తమిళ నటుడు సముద్రఖని ఓ కీలకపాత్రలో కనిపించబోతున్నారు. రవితేజకు జంటగా శ్రుతిహాసన్‌ నటించనున్నారు. తమన్‌ స్వరాలు అందించనున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.