close

తాజా వార్తలు

విశాఖలో ప్రారంభమైన జనసేన లాంగ్‌మార్చ్‌

విశాఖ: భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చేపట్టిన లాంగ్‌మార్చ్‌ ప్రారంభమైంది. రాష్టంలో ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మద్దిలపాలెంలోని తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం పవన్‌ లాంగ్‌మార్చ్‌ను ప్రారంభించారు. ఈ లాంగ్‌మార్చ్‌ రామాటాకీస్‌, ఆశీల్‌మెట్ట జంక్షన్‌ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఎదురుగా ఉన్న జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు కొనసాగనుంది. ఈ ర్యాలీకి తెదేపా మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ తరఫున సీనియర్‌ నేత అచ్చెన్నాయుడు తదితరులు ఈ లాంగ్‌మార్చ్‌లో పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు, అభిమానులు, భవన నిర్మాణ కార్మికులు ఈ నిరసన ర్యాలీకి తరలివచ్చారు. 

లాంగ్‌మార్చ్‌ లైవ్‌ వీక్షించండి



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.