close

తాజా వార్తలు

పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు శుభవార్త!

వెల్‌కమ్‌ బ్యాక్‌ పవర్‌స్టార్‌

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు శుభవార్త. ‘అజ్ఞాతవాసి’ తర్వాత రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్‌ సినిమాల్లో నటిస్తారా? లేదా? అనే సందేహంలో ఉన్న ఫ్యాన్స్‌కు ఎట్టకేలకు ఓ స్పష్టత వచ్చింది. ఆయన కొత్త సినిమా ఖరారైంది. హిందీ హిట్‌ ‘పింక్‌’ను తెలుగులో రీమేక్‌ చేయబోతున్నారు. ఇందులో పవన్‌ నటిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, తాజాగా ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చింది. టాలీవుడ్‌ నిర్మాత దిల్‌రాజుతో కలిసి బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. వేణుశ్రీరామ్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ సందర్భంగా సినీవిశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ చేసిన ట్వీట్‌ను బోనీ రీట్వీట్‌ చేశారు. ఇలా పవన్‌ సినిమాపై స్పష్టత రావడంతో అభిమానులు సోషల్‌మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. #WelcomeBackPSPK🤩 ట్రెండింగ్‌లో ఉంది.

‘పింక్‌’లో బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ నటించారు. 2016 సెప్టెంబరు 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విజయం సాధించింది. ఇదే సినిమాను తమిళంలో అజిత్‌తో బోనీ నిర్మించారు. కోలీవుడ్‌లోనూ హిట్‌ అందుకుని, చక్కటి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు తెలుగులోనూ ఈ సినిమా సందడి చేయబోతోంది. పవన్‌ 2018లో వచ్చిన ‘అజ్ఞాతవాసి’లో చివరిసారి వెండితెరపై కనిపించారు. ఈ సినిమా తర్వాత ఆయన ఎన్నికల ప్రచారం, రాజకీయాలతో బిజీ అయ్యారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.