close

తాజా వార్తలు

వైకాపా పతనానికి ఇసుక సమస్యే నాంది:పవన్‌

అమరావతి: ఇసుక సమస్యపై విశాఖలో తాను లాంగ్‌ మార్చ్‌ నిర్వహిస్తానన్న తర్వాతే రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఉద్యోగాల కంటే పోగొట్టిన ఉద్యోగాలు ఐదింతలని వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికులతో పవన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపాపై కక్షతోనే వైకాపా ప్రభుత్వం కూలీల పొట్టకొట్టిందని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వ పతనానికి ఇసుక సమస్యే నాంది అవుతుందని పవన్‌ హెచ్చరించారు. భవన నిర్మాణ కార్మికులకు పెద్దన్నయ్యలా అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.

నెల్లూరు జనసైనికులతో సమావేశం

జనసేన పార్టీని చాలా ప్రతికూల పరిస్థితుల్లో పెట్టానని పవన్‌ అన్నారు.  తానెప్పుడూ విజయాన్ని ప్రామాణికంగా చూడనని.. విలువలను మాత్రమే చూస్తానన్నారు. ఆశయాన్ని నమ్మి ఆఖరి క్షణం వరకు బతకగలననే నమ్మకం ఏర్పడిన తర్వాతే పార్టీ పెట్టానన్నారు. పార్టీ కార్యాలయంలో నెల్లూరు జిల్లా జనసైనికులతో ఆయన సమావేశమయ్యారు.  ప్రజలకు మంచి చేయడానికి అధికారం ఉండాలి తప్ప..రూ.వేలకోట్లు సంపాదించుకోవడానికి కాదని పవన్‌ చెప్పారు. 2014లో పార్టీ పెట్టినపుడు అభిమానులు మాత్రమే ఉన్నారని.. పెద్ద నేతలెవరూ లేరని వివరించారు. తన సినిమా పరాజయం పాలైనపుడు కూడా వ్యక్తిగతంగా తనను ఇష్టపడే అభిమానులు ఆ సమయంలో వెన్నంటే ఉన్నారన్నారు. సమాజంలో ప్రశ్నించేవారు లేకపోతే అరాచకం పెరిగిపోతుందన్నారు. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌పై బలమైన కేసులు పెట్టారని.. నెల్లూరులో వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఎంపీడీవోను బెదిరిస్తే ఏమీ చేయలేకపోయారని పవన్‌ ఆరోపించారు. ఐదేళ్లలో సీఎం అయిపోదామని పార్టీ పెట్టలేదన్నారు. వ్యక్తులమీద కేంద్రీకృతమయ్యే రాజకీయాలు అవసరం లేదని.. పార్టీకి భావజాలం ముఖ్యమని చెప్పారు. 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.