close

తాజా వార్తలు

‘భారతీయుడు 2’: కమల్‌ ఫొటోలు లీక్

చెన్నై: షూటింగ్‌ దశలో ఉండగా తమ చిత్రాలకు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది సంబంధిత చిత్రబృందం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే చిత్రబృందాలు ఈ లీకుల బారిన పడకుండా ఉండడం లేదు. అయితే తాజాగా శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ‘భారతీయుడు 2’ సినిమా నుంచి కమల్‌ హాసన్‌ ఫొటోలు లీక్‌ అయ్యాయి. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం ప్రస్తుతం భోపాల్‌ షెడ్యూల్‌లో పాల్గొంటోంది. రూ.40 కోట్ల బడ్జెట్‌తో భోపాల్‌లో ఓ ఫైట్‌ సీన్‌ను తెరకెక్కించనున్నట్లు ఇటీవల ఫైట్‌ మాస్టర్‌ పీటర్‌ హెయిన్స్‌ తెలిపారు. ఈ ఫైట్‌ సీన్‌లో 2000 వేల మంది జూనియర్‌ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. తాజాగా భోపాల్‌ షూటింగ్‌లో పాల్గొన్న కమల్‌హాసన్‌.. ‘సేనాపతి’ పాత్రలో ఉన్న కొన్ని ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

కమల్‌-శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రానికి సీక్వెల్‌గా 23 ఏళ్ల తర్వాత తెరకెక్కుతున్న చిత్రమిది. కాజల్‌ కథానాయిక. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సిద్ధార్థ్‌, ప్రియాభవానీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.