close

తాజా వార్తలు

మంజు.. నేను నిజాన్ని బయటపెడతాను: శ్రీకుమార్‌

నటి ఫిర్యాదుపై స్పందించిన దర్శకుడు

చెన్నై: తనను వేధింపులకు గురిచేశారంటూ నటి మంజు వారియర్‌ దర్శకుడు శ్రీకుమార్‌ మేనన్‌పై కేరళలోని ఓ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మెహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఒడియన్‌’ సినిమాలో ఆమె కథానాయికగా నటించారు. ఈ చిత్రానికి శ్రీకుమార్‌ మేనన్‌ దర్శకత్వం వహించారు. సోషల్‌మీడియా వేదికగా దర్శకుడు శ్రీకుమార్‌ తనను అవమానించాడని, తన స్నేహితులను సైతం వేధింపులకు గురిచేశారంటూ ఇటీవల మంజువారియర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను సైతం ఆమె పోలీసులకు అందచేశారు. ఈ క్రమంలో తాజాగా దర్శకుడు శ్రీకుమార్‌ సోషల్‌మీడియా వేదికగా ఈ విషయంపై స్పందించారు. ‘మంజు.. నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను మాత్రమే నీకు సహాయం చేశానన్న విషయాన్ని మర్చిపోయావా? నావల్లే నీకు అనేకమందితో పరిచయం కలిగింది. ఈ విషయాన్ని నువ్వు ఎలా మర్చిపోయావు. నువ్వు ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు. మీడియా ద్వారా నువ్వు నా మీద పెట్టిన ఫిర్యాదు గురించి తెలుసుకున్నాను. ఈ కేసు విచారణకు నేను పూర్తిగా సహకరిస్తాను. నాకు, మంజు వారియర్‌కు మాత్రమే తెలిసిన ఎన్నో నిజాలను ఈ విచారణలో బయటపెడతాను.’ అని శ్రీకుమార్‌ పేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.