close

తాజా వార్తలు

అటు ఉత్కంఠ.. ఇటు సందడి

● సమస్యల వలయంలో ‘బిగిల్‌’ ●
ప్రత్యేక షోలకు అనుమతి నిరాకరణ
మొదలైన బుకింగ్‌ ప్రక్రియ ●
కథ చోరీపై మళ్లీ న్యాయస్థానానికి..?


విజయ్‌.. వానలోనూ టికెట్ల కోసం వరుసలో ఉన్న అభిమానులు

కోడంబాక్కం, న్యూస్‌టుడే: విజయ్‌ నటించిన ‘బిగిల్‌’ చిత్రం సమస్యల వలయంలో చిక్కుకుంది. సినిమా విడుదల తేదీ దగ్గరపడేకొద్దీ సమస్యలు ముదురుతున్నాయి. కథ చోరీ కేసు న్యాయస్థానంలో నడుస్తున్న విషయం తెలిసిందే. సహాయ దర్శకుడు సెల్వకు కాపీరైట్‌ పిటిషన్‌ దాఖలు చేసుకునే అవకాశాన్ని మద్రాసు హైకోర్డు మంగళవారం కల్పించింది. ఇదిలా ఉండగా సినిమాకు సంబంధించిన సందడి మొదలైంది. మంగళవారం సాయంత్రం నుంచి రిజర్వేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. జోరు వానను సైతం లెక్కచేయకుండా విజయ్‌ అభిమానులు టికెట్ల కోసం క్యూ కట్టారు. చెన్నైలోని చాలా వరకు థియేటర్లలో టికెట్ల విక్రయం జోరుగా సాగుతోంది.

ప్రత్యేక షోలకు అనుమతి లేదు: మంత్రి

దీపావళి సందర్భంగా ‘బిగిల్‌’ చిత్రం విడుదలవుతున్న విషయం తెలిసిందే. దాదాపు రూ.180 కోట్లకు పైగా ఈ సినిమాను నిర్మించినట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అందుకే భారీ ఓపెనింగ్స్‌పై ఈ చిత్రం దృష్టి పెట్టింది. సాధారణంగా పెద్ద హీరోల చిత్రాలకు రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ప్రత్యేక షోలకు అనుమతి ఇస్తుంది. అయితే ఈ సారి దీపావళికి వస్తున్న ఏ సినిమాకు ప్రత్యేక షోలకు అనుమతి లేదని మంత్రి కడంబూర్‌ రాజు మంగళవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ప్రత్యేక షోల పేరిట రాష్ట్రంలోని థియేటర్ల యాజమాన్యాలు అధిక ధరకు టికెట్లు విక్రయిస్తున్నాయని, దీంతో ప్రేక్షకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఒకవేళ ఈ నిబంధనలను అతిక్రమిస్తే సదరు థియేటర్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ప్రభుత్వ నిర్ణయం ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ‘బిగిల్‌’ ఆడియో వేడుకలో విజయ్‌ చేసిన వ్యాఖ్యలు అన్నాడీఎంకే వర్గాల్లో ఆగ్రహాన్ని తెప్పించాయి. అందుకే ఇప్పుడు అనుమతి ఇవ్వడం లేదని ప్రచారం జరుగుతోంది. మరో వైపు థియేటర్‌ యజమానుల సంఘం అధ్యక్షుడు తిరుప్పూరు సుబ్రహ్మణ్యం దీనిపై స్పందించారు. మంత్రితో ఈ విషయమై చర్చలు జరుపుతామన్నారు.

అడ్డంకులు తొలగేనా..?

‘బిగిల్‌’ కథ తనదని సహాయ దర్శకుడు సెల్వ కొంత కాలంగా ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చింది. కాపీరైట్‌ విభాగం కింద కొత్తగా పిటిషన్‌ వేసుకోవడానికి సహాయ దర్శకుడు సెల్వకు న్యాయస్థానం అవకాశం కల్పిస్తూ ఉత్తర్వు చేసింది. అయితే సినిమా విడుదలకు సంబంధించి ఎలాంటి ఉత్వర్వులు జారీ చేయలేదు. దీంతో సినిమా విడుదల అంశంలో గందరగోళం తలెత్తింది. అసలు సినిమా విడుదలవుతుందా? లేదా..? అన్న చర్చ సాగుతోంది. ఇదిలా ఉండగా కథ చోరీ అంశంపై సెల్వ బుధవారం మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారని సమాచారం. అయితే అంతకు ముందుగానే ఆయనతో చిత్రవర్గాలు చర్చించే అవకాశాలు ఉన్నాయి. విజయ్‌ నటిస్తున్న చిత్రాలకు కొంత కాలంగా ఇలాంటి సమస్యలు ఎదురవుతున్న విషయం తెలిసిందే. ‘సర్కార్‌’ కూడా ఇలా పలు సమస్యలను దాటి తెరపైకి వచ్చింది.

కడంబూర్‌ రాజు


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.