close

తాజా వార్తలు

ఫీజు కట్టడానికి డబ్బులుండేవి కాదు

బాలీవుడ్‌ నటుడు రాజ్‌కుమార్‌ రావు

ముంబయి: సినిమాల్లోకి రాకముందు ఆర్థికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాను అని అంటున్నారు బాలీవుడ్‌ నటుడు రాజ్‌కుమార్‌ రావు. తాజాగా ఆయన ‘మేడ్‌ ఇన్‌ చైనా’ సినిమాలో నటించారు. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘సినిమాల్లోకి రాకముందు నేను ఆర్థికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాను. మాది ఓ మధ్యతరగతి కుటుంబం. చిన్నతనంలో స్కూల్‌  ఫీజు కట్టడానికి కూడా నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. కొన్నిసార్లు ఉపాధ్యాయులే నా స్కూల్‌ ఫీజు కట్టేవాళ్లు. సిటీకి వచ్చాక కొందరు మిత్రులతో కలిసి చిన్న ఇంట్లో అద్దెకు ఉన్నాను. ఆ సమయంలో నా అకౌంట్‌లో రూ.18 మాత్రమే బ్యాలెన్స్‌ ఉండేది.’ అని ఆయన తెలిపారు.

ఈ ఏడాదిలో విడుదలైన ‘జడ్జిమెంటర్‌ హై క్యా’ సినిమా తర్వాత రాజ్‌కుమార్‌ రావు నటించిన సినిమా ‘మేడ్‌ ఇన్‌ చైనా’. ఈ సినిమాలో ఆయన ఓ వ్యాపారి పాత్రలో నటించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మోనీ రాయ్‌, బొమాన్‌ ఇరానీ కీలకపాత్రలు పోషించారు. అక్టోబర్‌ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.