close

తాజా వార్తలు

చివరి దశలో నయనతార కొత్త సినిమా

 

నయనతార

కోడంబాక్కం, న్యూస్‌టుడే: నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘నెట్రిక్కన్‌’. నయన్‌ ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కార్తిక్‌ గణేశ్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి గిరీష్‌ సంగీతం సమకూర్చుతున్నారు. మిలింద్‌రావ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తయింది. ఇప్పుడు రెండో షెడ్యూల్‌ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ విషయాన్ని మిలింద్‌రావు ప్రకటించారు. చిత్రీకరణ త్వరలోనే పూర్తయ్యే అవకాశముందని సమాచారం. ఇందులో అంధ యువతిగా నయనతార నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘బ్లైండ్‌’ అనే కొరియన్‌ సినిమా ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారని తెలిసింది. సీరియర్‌ కిల్లర్‌ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.