close

తాజా వార్తలు

నువ్వు నాతో ఏమన్నావో, నేనేం విన్నానో..

ఆకట్టుకుంటోన్న ‘డిస్కోరాజా’ పాట

హైదరాబాద్‌: ‘నువ్వు నాతో ఏమన్నావో, నేనేం విన్నానో.. బదులేదో ఏం చెప్పావో, ఏమనుకున్నానో..’ అని ప్రేమ సాగరంలో మునిగి తేలుతున్నారు మాస్‌ మహారాజా రవితేజ. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘డిస్కోరాజా’. వి.ఐ ఆనంద్‌ దర్శకుడు. ఈ సినిమాలోని తొలి పాటను శనివారం విడుదల చేశారు. ‘నువ్వు నాతో..’ అని సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది. ఈ పాటకు తమన్‌ స్వరాలు అందించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం సమకూర్చారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం గాత్రం అందించారు. ఈ పాట విడుదలైన కొద్ది సేపట్లోనే 11 వేల మంది యూట్యూబ్‌లో లైక్‌ చేశారు. నటి పాయల్‌ రాజ్‌పుత్‌, రవితేజపై ఈ గీతాన్ని చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

‘డిస్కో రాజా’ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. బాబీ సింహా, వెన్నెల కిశోర్‌, సత్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ ఇప్పుడు ఈ సినిమాలో నటిస్తున్నారు. మరోపక్క ఆయన హీరోగా ‘మహా సముద్రం’ అనే సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.