close

తాజా వార్తలు

నన్నింకా వెన్ను నొప్పి బాధిస్తోంది:పవన్‌

విజయవాడ: సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను వెన్ను నొప్పి బాధిస్తోందట. ‘గబ్బర్‌సింగ్‌’ సినిమా షూటింగ్‌లో తీవ్రంగా గాయపడటంతో అప్పటి నుంచి ఆయన వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో విజయవాడలో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి హాజరు కాలేకపోతున్నానని ఒక ప్రకటనలో తెలిపారు.

‘‘విజయవాడలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేసి, దానికి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. మీడియా స్వేచ్ఛకోసం పోరాటం చేస్తున్న మీకు  జనసేన మద్దతు ఎప్పుడూ ఉంటుంది. అయితే, ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల నేను ఈ సమావేశానికి హాజరుకాలేకపోతున్నా. ‘గబ్బర్‌సింగ్‌’ షూటింగ్‌ సమయంలో వెన్ను పూసలకు తీవ్ర గాయాలు కావడంతో తరచూ నన్ను వెన్ను నొప్పి బాధిస్తోంది. ఇటీవల ఎన్నికల ప్రచార సమయంలో అశ్రద్ధ చేయడం వల్ల గాయాల నొప్పి తీవ్రత పెరిగింది. డాక్టర్‌ సర్జరీకి వెళ్లమని సలహా ఇచ్చినప్పటికీ, సంప్రదాయ వైద్యంపై నమ్మకంతో ఆ దిశగానే ముందుకు వెళ్తున్నా. గత కొన్ని రోజులుగా వెన్ను నొప్పి తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. చికిత్స తీసుకుంటున్నా. ఈ కారణంగానే గత మూడు రోజులుగా ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అయితే, జనసేన తరపున పార్టీ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. అభినందనలతో పవన్‌కల్యాణ్‌’’ అని ప్రకటనలో తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.