close

తాజా వార్తలు

సౌందర్య ముఖంపై కాలు పెట్టినప్పుడు...

ఇంటర్నెట్‌డెస్క్‌: కేవలం గ్లామర్‌ హీరోయిన్‌గానే కాకుండా, కథానాయిక ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనూ నటించి మెప్పించారు రమ్యకృష్ణ. ‘నరసింహ’ చిత్రంలో ఆమె చేసిన ‘నీలాంబరి’ పాత్రే అందుకు ఉదాహరణ. మొత్తం కెరీర్‌లో ఇలాంటి పాత్రలు ఒకట్రెండు మాత్రమే వస్తాయని చెబుతారామె. రజనీకాంత్‌కు పోటీగా ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అంత మంచి పేరు తెచ్చిన ఆ పాత్ర చేయడం ఆమెకు అస్సలు ఇష్టం లేదట. ఓ ఇంటర్వ్యూలో ఆమె ఇదే విషయాన్ని పంచుకున్నారు. 

‘‘నరసింహ’లో నీలాంబరి పాత్ర గురించి మొదట నాకు చెప్పినప్పుడు అస్సలు ఇష్టపడలేదు. ఎందుకంటే ఆ పాత్రలో పొగరు, గర్వం నిండిపోయి ఉంటాయి. అలా దాన్ని తీర్చిదిద్దారు. అప్పుడు దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ ‘మీరు నీలాంబరి పాత్రలో నటిస్తారా? లేక వసుంధర(సౌందర్య) పాత్ర చేస్తారా’ అని నన్ను అడిగి ఉంటే, తప్పకుండా సౌందర్య చేసిన పాత్రలో చేస్తానని చెప్పేదాన్ని. కానీ, ఆయన నన్ను అలా అడగలేదు. ఈ చిత్రంలో నేను సౌందర్య ముఖంపై కాలు పెట్టే సన్నివేశం ఉంది. అందులో నటిస్తున్నప్పుడు చాలా ఇబ్బందిపడ్డా. మేము నటిస్తున్నామని తెలిసినా, ఆమె ముఖంపై కాలు పెట్టడానికి నాకు మనసు రాలేదు. అయితే, దర్శకుడు, కథ, నీలాంబరి పాత్రపై ఉన్న నమ్మకంతో అలా చేయగలిగా.’’ అని చెప్పుకొచ్చారు. 

1999లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. రజనీ స్టైల్‌, రమ్యకృష్ణ నటన ‘నరసింహ’ను విజయపథంలో నడిపాయి.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్
HITS2020
VITEEE 2020
Saket Pranamam

Panch Pataka

దేవతార్చన