close

తాజా వార్తలు

కడప ఇసుక బెంగళూరులో ప్రత్యక్షం: చంద్రబాబు

కడప: రాష్ట్రంలో తెదేపా నాయకులు, కార్యకర్తలను వైకాపా ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొందామని.. ఎవరూ అధైర్య పడొద్దని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. అక్రమ కేసులతో తమ పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి, బద్వేలు నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థాగత ఎన్నికల్లో పార్టీకి సేవ చేసిన వారినే ఎన్నుకోవాలని సూచించారు. అధికారంలో ఉన్నప్పుడు వచ్చి పోయే ఆయారాం.. గయారాంలకు ఇకపై స్వస్తి పలుకుదామని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. సొంత బాబాయ్‌ వివేకానంద రెడ్డి హత్య జరిగి ఆరునెలలు దాటినా నిందితులెవరో తేల్చలేకపోయారని సీఎం జగన్‌ను ఉద్దేశించి ఆయన విమర్శించారు. 

అణగదొక్కాలని చూస్తే ఇంకా పైకి లేస్తాం

వైకాపా ఆరునెలల పాలనంతా కూల్చివేతలు, దౌర్జన్యాలు, తెదేపా నేతలపై కేసుల పెట్టి బెదిరించడంతోనే సరిపోయిందని చంద్రబాబు ఆక్షేపించారు. తమ నేతల ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి జగన్ ప్రణాళికలు రచిస్తున్నారని.. ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కొనే ధైర్యం తమకు ఉందని చెప్పారు. ఇప్పటివరకు తమ పార్టీ నేతలపై 51 కేసులు నమోదు చేశారని వివరించారు. తెదేపాను అణగదొక్కాలని చూస్తే ఇంకా పైకి లేస్తామని చంద్రబాబు హెచ్చరించారు. తాము కూడా గత ఐదేళ్లలో కక్ష పూరితంగా వ్యవహరించి ఉంటే ఒక్క వైకాపా కార్యకర్త కూడా మిగిలేవాడు కాదని వ్యాఖ్యానించారు. ఇసుక కొరత లేదని సీఎం చెబుతున్నారని.. కడప ఇసుక బెంగళూరులో ప్రత్యక్షమవుతోందని చెప్పారు. వైకాపా ప్రభుత్వ పాలన తిరోగమనం వైపు సాగుతోందని.. కేవలం పులివెందుల, పుంగనూరుకు మాత్రమే నిధులు విడుదల చేస్తే మిగిలిన 173 నియోజకవర్గాల పరిస్థితి ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. అధికారులు చట్ట ప్రకారం నడుచుకోవాలని.. ఎప్పుడూ ఇదే ప్రభుత్వం ఉంటుందనే భ్రమలు వీడాలని హితవు పలికారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.