close

తాజా వార్తలు

నవయుగ దుశ్శాసనుడు

భార్య స్నానం చేసిన దృశ్యాలను చిత్రీకరించిన భర్త

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: భార్యకు ఏ ఆపద వచ్చినా కడదాకా అండగా నిలవాల్సిన భర్తే వికృత చర్యలకు పాల్పడ్డాడు. భార్య స్నానం చేస్తుండగా ఆమెకు తెలియకుండా తన చరవాణిలో వీడియో చిత్రీకరించాడు. దానిని భార్యకు చూపి..అదనంగా కట్నం ఇవ్వకపోతే అంతర్జాలంలో పెడతానంటూ బెదిరింపులకు దిగాడు. ఈ దుశ్చర్యను భరించలేని బాధితురాలు ఆమె తల్లితో కలిసి సోమవారం అర్బన్‌ స్పందనలో ఫిర్యాదు చేశారు.గుంటూరు శ్రీనివాసరావుపేటకు చెందిన ఓ గృహిణి  తన పెద్ద కుమార్తెను తాడికొండకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి 2017లో వివాహం చేశారు. అనంతరం అదనపు కట్నం కోసం అతడు భార్యను వేధించడం ప్రారంభించాడు. ఇటీవల భార్య స్నానం చేస్తుండగా చరవాణిలో చిత్రీకరించి అనైతికానికి పాల్పడ్డాడు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.