
తాజా వార్తలు
అహ్మదాబాద్: ప్రియురాలిని కలవడానికి వెళ్లడానికి వీలు లేదు అని అభ్యంతరం తెలిపిందని భార్యనే గదిలో బంధించి మరి ప్రియురాలి దగ్గరకు వెళ్లాడో భర్త.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గుజరాత్లోని అహ్మదాబాద్ జిల్లాలోని రాయ్పూర్ ప్రాంతంలో నివాసం ఉండే మహిళకు 16 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఆడ పిల్లలు పుట్టారన్న కారణంతో అత్తింటి వారు ఆమెను వేధిస్తుండేవారు. కాగా భర్త మూడు సంవత్సరాల నుంచి మరో స్త్రీతో ప్రేమాయణం సాగిస్తున్నాడు.
ఆదివారం సాయంత్రం భర్త తన ప్రియురాలిని కలవడానికి వెళ్తున్న విషయం తెలుసుకున్న భార్య అతనిని వెళ్లడానికి వీలు లేదని అడ్డుపడింది. అయినప్పటికీ భర్త వినకపోగా ఆమెను ఇంటిలో ఒక గదిలో బంధించి వెళ్లిపోయాడు. భార్య కిటికీలో నుంచి తనను కాపాడమని కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న వ్యక్తి ఇంటి తాళం పగలకొట్టి ఆమెను బయటకు తీసుకుని వచ్చాడు. వెంటనే ఆమె భర్త ప్రియురాలి ఇంటికి వెళ్లగా అక్కడ ఇద్దరు ఉన్నారు. వెంటనే ఆమె పోలీసులను ఆశ్రయించి గృహహింస చట్టం కింద భర్త, అత్తింటి వారి మీద కేసు నమోదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు తెలిపారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ఇక పీఎఫ్ తగ్గించుకుని.. జీతం పెంచుకోవచ్చా..!
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- సంజుకు.. కోహ్లీసేనకు.. చావోరేవో
- భాజపాకు తెరాస షాక్!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
