close

తాజా వార్తలు

Published : 20/10/2019 00:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భార్యకోసం ఇల్లు కట్టాలి!

అవునా

న సమాజంలో... పెళ్లి సమయంలో కట్న కానుకలను వరుడి కుటుంబానికి ఇవ్వడం ఆనవాయితీ. కానీ కృష్ణా జిల్లాలోని పెడన చుట్టుపక్కల ఉండే ‘యానాది’ గిరిజన తెగకు చెందిన వారు అమ్మాయి తల్లిదండ్రులకే కట్నం ఇస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయమని చెబుతారు వారు. వీళ్ల సామాజిక కట్టుబాట్లు ఇతరులకు భిన్నంగా ఉంటాయి. పెళ్లి అనేది కేవలం రెండు కుటుంబాల మధ్య ఒప్పందంగా భావిస్తారు. పెళ్లి చేసుకోబోయే యువకుడు... తన భార్య కోసం కొత్త ఇల్లు నిర్మించుకోవాల్సి ఉంటుంది. అమ్మానాన్నల మీద ఆధారపడకుండా సొంతంగా భార్యను పోషించగమని నిరూపించుకుంటేనే పెళ్లికి వధువు తరఫు వారు ఒప్పుకుంటారు. పెళ్లికూతురు తల్లిదండ్రులకు నేరుగా కట్నం రూపంలో చెప్పిన నగదు చెల్లిస్తారు. వీరు ఇచ్చే కట్నం అత్యధికంగా నాలుగువేల రూపాయలకు మించి ఉండదు. నగర జీవనానికి పూర్తి దూరంగా ఉంటారు. వ్యవసాయం, వేట, ఎలుకలు, పీతలు పట్టడం, రోజుకూలీ వంటివే వీరి జీవనాధారం. ఇప్పటికీ వీరిలో చాలామందికి కనీస వసతులు లేవు. ఎవరూ పుట్టిన రోజు, ఇతర ప్రత్యేక రోజులను గుర్తించరు. వయసు గురించి ఎవరిని అడిగినా వారి నుంచి తెలియదనే సమాధానమే వస్తుంది.


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని