
తాజా వార్తలు
అమీర్‌పేట, న్యూస్‌టుడే: పుట్టింటికి వెళ్లిన భార్య వెంటనే తిరిగి రాలేదన్న కోపంతో అతడు రగిలిపోయాడు. అది ఆగ్రహాగ్నిగా మారడంతో, బావమరుదుల ఇంటి బయట నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలను దగ్ధం చేశాడు. ఎస్సార్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో సంఘటన ఇది. ఇన్స్పెక్టర్ ఎస్.మురళీకృష్ణ వెల్లడించిన వివరాల ప్రకారం.. జియాగూడకు చెందిన సంతోష్(36) వ్యాపారం చేస్తున్నాడు. అతడికి బోరబండకు చెందిన సబితతో 10 సంవత్సరాల కిందట వివాహం జరిగింది. ఆమె ఓ దుకాణంలో పనిచేస్తోంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మద్యానికి బానిసైన సంతోష్ తరచూ డబ్బులివ్వమని భార్యను వేధిస్తుండేవాడు. తట్టుకోలేక నెలన్నర కిందట ఆమె శ్రీరామ్‌నగర్‌లోని తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. తిరిగి రావాలని ఎంత కోరినా రాకపోవడంతో కక్ష పెంచుకున్న అతడు ఆదివారం అర్థరాత్రి శ్రీరామ్‌నగర్‌లోని తన భార్య కుటుంబీకుల ఇంటి పరిసరాలకు వచ్చాడు. దాదాపు 2 గంటల ప్రాంతంలో ఓ సీసా తెచ్చి అక్కడే ఉన్న వేరొక వాహనంలోని పెట్రోలు తీసుకున్నాడు. ఇంటి బయట నిలిపి ఉంచిన తన బావమరుదులకు చెందిన రెండు ద్విచక్ర వాహనాలపైనా పెట్రోలు చల్లి నిప్పుపెట్టి పరారయ్యాడు. రెండు బండ్లూ పూర్తిగా దగ్ధమయ్యాయి. సమీపంలో నిలిపి ఉంచిన మరో కారు కూడా పాక్షికంగా కాలిపోయింది. పోలీసులు సంఘటన స్థలం సమీపంలోని సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజి ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు జరుపుతున్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- మృతదేహాల అప్పగింతపై సుప్రీం ఆదేశం
- క్రికెట్లో అక్రమార్కుల పేర్లు బయటపెడతా
- పాక్‌లోనూ గూగుల్ టాప్-10లో మనోళ్లు
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- మీ తప్పులను సరిదిద్దేందుకే ఈ బిల్లు: రిజిజు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
