close

తాజా వార్తలు

కమీషన్ల కోసమే సమీక్షలు: కళా వెంకట్రావు

విజయవాడ: సీఎం జగన్ స్వార్థం వల్లే ఆంధ్రప్రదేశ్ అంధకారమైందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. వర్షాకాలంలో శ్రీశైలం, సాగర్‌లో జలవిద్యుదుత్పత్తి జరుగుతున్నా విద్యుత్తు కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. కమీషన్ల కోసమే సమీక్షల పేరుతో విద్యుత్తు కొరత సృష్టించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కళా మాట్లాడారు. తెదేపా హయాంలో 24గంటల నిరంతర విద్యుత్తు ఇస్తే ఇప్పుడు ప్రజలకు అవసరమైన సమయంలోనే ఎక్కువ కోతలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పవన, సౌర విద్యుత్తు రూ.3 నుంచి రూ.4 కే లభ్యమవుతున్నా.. రూ.11.68 థర్మల్ విద్యుత్తు కొంటున్నారని ఆక్షేపించారు. సొంత పవర్‌ప్లాంట్‌ ద్వారా రూ.4.84 రూపాయలకు కర్ణాటకకు విద్యుత్తు అమ్ముతున్న జగన్.. రాష్ట్రం పట్ల ఎందుకు దృష్టి సారించడం లేదని ప్రశ్నించారు. రూ.1600కే లభించే టన్ను బొగ్గును తెలంగాణ నుంచి రూ.3వేల పైచిలుకు కొనడం వెనుక ఆంతర్యమేంటో చెప్పాలని కళా వెంకట్రావు డిమాండ్‌ చేశారు. పీపీఏల విషయంలో తమపై బురద చల్లే ప్రక్రియ తప్ప విద్యుత్తు వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం మాత్రం చేయటం లేదని విమర్శించారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే సీఎం తన ఇంటి చుట్టూ 144సెక్షన్ పెట్టుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.