close

తాజా వార్తలు

‘జగమొండితనమే’ రాష్ట్రానికి శాపం:చంద్రబాబు

అమరావతి: రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు ‘జగమొండితనం’ శాపం అయిందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధిని రివర్స్‌ చేస్తున్న ప్రభుత్వం నడుస్తోందని.. దాని ఫలితమే ఈ అప్రకటిత విద్యుత్‌ కోతలని విమర్శించారు. ఈ మేరకు ట్విటర్‌లో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గత తెదేపా ప్రభుత్వం కేంద్రం తోడ్పాటుతో తెచ్చిన నిరంతర విద్యుత్‌ను కూడా రివర్స్ చేసేశారని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చాక 9 గంటల విద్యుత్‌ ఇస్తామన్న వైకాపా ప్రభుత్వం.. ప్రస్తుతం అందులో సగాన్ని కోసేశారని ధ్వజమెత్తారు. పీపీఏలను మూర్ఖంగా రద్దుచేసిన దుష్ఫలితమే రాష్ట్రంలో ఈ అంధకారమన్నారు. థర్మల్ విద్యుత్ ఆధారపడదగినది కాదని.. పైగా పర్యావరణ హితం కూడా కాదని తెలిపిన చంద్రబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ పరిణామాలను ముందే ఊహించి తాము సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిని పెద్దఎత్తున ప్రోత్సహించామని గుర్తుచేశారు. ‘‘ముఖ్యమంత్రి జగన్‌కు తెలియదు.. ఇతరులు చెబితే వినరు’’ అంటూ ఎద్దేవా చేశారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.