close

తాజా వార్తలు

అమ్మే పిల్లలను అమ్మకానికి పెట్టింది

దిల్లీలో దారుణం

దిల్లీ: అక్కున చేర్చుకోవాల్సిన 15ఏళ్ల కూతుర్ని అక్రమార్కుల పాల్జేసిందో తల్లి. పొత్తిళ్లలో దాచుకోవావల్సిన పసిబిడ్డను కాసులకు అమ్మేసింది. దిల్లీలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దిల్లీకి చెందిన ఓ మహిళ తన భర్త చనిపోవడంతో నలుగురి పిల్లలను కూలి పని చేసి పెంచుతోంది. ఈ క్రమంలో ఆమె మరో వ్యక్తిని పెళ్లాడింది. విలాసవంతమైన జీవితం కోసం అప్పులు చేయడంతో వాటిని తీర్చేందుకు పిల్లల జీవితాలను పణంగా పెట్టింది. వారిలో 15ఏళ్ల వయసున్న పెద్ద కుమార్తెను రూ.లక్షకు అమ్మకానికి పెట్టింది. బంధువుల ఇంటికి తీసుకెళుతున్నట్లు ఆ బాలికను నమ్మబలికి ఓ హోటల్‌కి తీసుకెళ్లి గుర్తుతెలియని వ్యక్తులకు అప్పజెప్పింది. వారు ఆ బాలికకు బాల్య వివాహం చేయాలని ప్రయత్నించగా ఆదివారం తప్పించుకుని వచ్చి బవానాలోని తన నివాసానికి చేరుకుంది. స్థానికుల సాయంతో పోలీసులను ఆశ్రయించింది.  తనతో పాటు ఏడాది వయసున్న తమ్ముడిని కూడా అమ్మేసినట్లు బాలిక పోలీసులకు వివరించింది. పోలీసులు కేసు నమోదు చేసి, ఆ బాలికను షెల్టర్‌ హోమ్‌కి తరలించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.