close

తాజా వార్తలు

హైదరాబాద్‌పై చింతామోహన్‌ ఆసక్తికరవ్యాఖ్యలు

తిరుపతి: నవ్యాంధ్ర రాజధానిగా తిరుపతి సరైన ప్రాంతమని మాజీ ఎంపీ చింతామోహన్‌ పునరుద్ఘాటించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసేందుకు భాజపా ప్రణాళికలు రచిస్తోందన్నారు. రాజ్యసభలో మెజారిటీ కోసం భాజపా ఎదురుచూస్తోందని చెప్పారు. ఓ పక్క రాయలసీమలో ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే.. ప్రధాని మోదీ రష్యాలో పేదల కోసం రూ.7వేల కోట్లు ఇవ్వడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. తితిదే ఈవో అనిల్‌ సింఘాల్‌పైనా ఆయన ఆరోపణలు చేశారు. అమరావతిలోని తుళ్లూరు శాపగ్రస్త ప్రాంతమని.. సీఎం జగన్ ఆ ప్రాంతంలో ఉన్నంత కాలం విజయవంతం కాలేరని చింతామోహన్‌ వ్యాఖ్యానించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.