close

తాజా వార్తలు

ఆమెది క్షమించరాని నేరం

చెన్నై (లీగల్‌): తన నుంచి విడిపోయిన భర్తపై కక్ష తీర్చుకోవాలనుకున్న ఓ భార్య కుమార్తెను పావుగా వాడుకుని, అతడిపై దారుణమైన ఆరోపణలతో పోక్సో కేసుపెట్టింది.. అవన్నీ తప్పుడు ఆరోపణలని తేలడంతో ఆ మహిళపై అదే చట్టం కింద కేసు నమోదు చేయాలని మద్రాస్‌ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు పోక్సో చట్టాన్ని దుర్వినియోగం చేసేవారికి ఓ హెచ్చరిక కావాలంటూ న్యాయమూర్తి వ్యాఖ్యానించడం విశేషం.

చెన్నైకు చెందిన 11 ఏళ్ల బాలికపై కన్నతండ్రే అఘాయిత్యానికి పాల్పడ్డాడని, దీంతో ఆమె గర్భం దాల్చిందంటూ చెన్నైలోని ఓ పోలీస్‌ స్టేషన్‌లో బాలిక తల్లి ఇటీవల ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆమె భర్తపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు.

ఈ కేసును కొట్టివేయాలంటూ మద్రాసు హైకోర్టులో అతడు పిటిషన్‌ దాఖలు చేశాడు. న్యాయమూర్తి జస్టిస్‌ ఆనంద్‌ వెంకటేశ్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణకు చేపట్టింది. సరిగ్గా ఇదే సమయంలో కేసు కీలక మలుపు తిరిగింది. బాధితురాలిగా పేర్కొన్న బాలిక తన తల్లి చేసినవి తప్పుడు ఆరోపణలని వెల్లడించడంతో కేసు అడ్డం తిరిగింది. ఈ విషయాన్ని ఆ బాలిక ఎగ్మూరులోని ఫ్యామిలీ కోర్టులో వెల్లడించిందని స్వయంగా న్యాయమూర్తే పేర్కొన్నారు. భర్తపై కక్ష సాధింపు కోసమే ఆ బాలిక తల్లి భర్తపై తప్పుడు ఫిర్యాదు ఇచ్చిందని ఆయన తెలిపారు. తండ్రే కుమార్తెపై లైంగికదాడికి పాల్పడ్డాడనే ఈ వ్యాజ్యం దురదృష్టకరమని పేర్కొన్నారు. 
ఆ బాలికను తాను పిలిపించి విచారించగా... ఫ్యామిలీ కోర్టులో చెప్పిన విషయాన్నే తనకూ తెలిపిందని, అది తన మనసును కలచివేసిందని.. వెల్లడించారు. భర్తపై కక్ష సాధించడం కోసం కన్న కుమార్తెపై దారుణమైన ఆరోపణ చేయడానికి ఓ తల్లికి ఎలా మనసు వచ్చిందో తెలియడం లేదని వ్యాఖ్యానించారు. పిటిషనరుపై పోక్సో కేసును తక్షణం రద్దు చేయడంతోపాటు ఆ చట్టాన్ని దుర్వినియోగం చేసిన మహిళపై అదే చట్టం కింద కేసు నమోదు చేయాలని పోలీసు శాఖను ఆదేశిస్తున్నట్టు తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.