close

తాజా వార్తలు

తాగుబోతు భర్తను కడతేర్చిన భార్య

 సహకరించిన ఆమె కుటుంబసభ్యులు

పెద్దపల్లి, న్యూస్‌టుడే: నిత్యం తాగొచ్చి వేధింపులకు గురిచేస్తున్న భర్తను తల్లిదండ్రులు, సోదరుల సహాయంతో భార్య హతమార్చిన ఘటన పెద్దపల్లి జిల్లా చందపల్లిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఎన్టీపీసీలోని ఎలుకపల్లిగేటు వద్ద నివాసం ఉండే సయ్యద్‌ఖలీంకు పెద్దపల్లి మండలం చందపల్లికి చెందిన ఆస్రాబేగంతో 11 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్నాళ్లు రామగుండంలోని ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఒప్పంద కార్మికుడిగా పనిచేసిన ఖలీం ఉద్యోగం మానేసి ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసై నిత్యం తాగొచ్చి భార్యను కొడుతుండడంతో ఏడాదిన్నర క్రితం ఆమె పుట్టింటికి వచ్చింది. ఇద్దరుపిల్లలతో ఆమె పెద్దపల్లిలోనే ఉంటుండగా ఖలీం అప్పుడప్పుడు తాగొచ్చి గొడవ చేస్తున్నాడు. భార్యతోపాటు అత్తపై దాడులకు పాల్పడుతుండడంతో ఆమె కుటుంబసభ్యులు పూర్తిగా విసిగిపోయారు. ఆదివారం కూడా తాగి వచ్చిన ఖలీం రాత్రి ఇక్కడే పడుకున్నాడు. నిద్రిస్తున్న ఆయనను భార్యతోపాటు ఆమె తల్లిదండ్రులు, సోదరులు కర్రలు, బండరాళ్లతో బాదడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. హత్య చేసిన అనంతరం కుటుంబసభ్యులు పారిపోవడం, వీరి నివాసం గ్రామానికి చివర ఉండడంతో హత్య ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. హతుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఆస్రాబేగంతోపాటు ఆమె కుటుంబసభ్యులు గౌస్‌ఖాన్‌, సుల్తానా, ఎండీ గౌస్‌, ఎండీ జాఫర్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.