
తాజా వార్తలు
భార్య,ఇద్దరి పిల్లల్ని హత్య చేసిన భర్త
వికారారాబాద్: జిల్లా కేంద్రంలోని శివరామనగర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్య, పిల్లలను భర్త అతి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన సోమవారం తెల్లజామున జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం తాండూరు మండలం నారాయణపూర్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్, భార్య చాందిని(30), పిల్లలు అయాన్(10), ఏంజిల్(5) గతకొంతకాలంగా వికారాబాద్‌లోని శివరామనగర్కాలనీ నివాసముంటున్నారు. ప్రవీణ్ భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకోవడంతో.. ఇద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఘర్షణ పడ్డారు. ద్వేషం పెంచుకున్న ప్రవీణ్ ఆదివారం అర్ధరాత్రి దాటాక ఇనుక కడ్డీతో భార్య, పిల్లల తలలపై బలంగా మోదాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. అక్కడనుంచి నేరుగా నిందితుడు ప్రవీణ్‌కుమార్ నేరుగా వికారాబాద్ పోలీసు ఠాణాకు వెళ్లి లొంగిపోయాడు. జరిగిన దారుణాన్ని పోలీసులకు వివరించాడు. సీఐ శ్రీనివాసరావు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.