close

తాజా వార్తలు

అర్హులైన క్రీడాకారులందరూ భారత్‌ రావొచ్చు

దిల్లీ: భారత్‌లో జరిగే క్రీడా పోటీల్లో అర్హులైన, ఆయా దేశాల జాతీయ ఒలింపిక్‌ కమిటీ గుర్తింపు పొందిన క్రీడాకారులైనా పాల్గొనవచ్చని కేంద్ర క్రీడలశాఖ మంత్రి కిరెణ్‌ రిజిజు గురువారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ ఫెడరేషన్ల గుర్తింపు ఉన్న క్రీడాకారులు ఎవరైనా భారత్‌లో జరిగే అన్ని అంతర్జాతీయ క్రీడాపోటీల్లో పాల్గొనేందుకు ప్రభుత్వం అనుమతిస్తున్నట్లు ఆయన తెలిపారు. పాకిస్తాన్‌ సహా ప్రపంచ దేశాలన్నీ భారత్‌లో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. ఈ విషయంపై భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌తో పాటు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీకి ఓ లేఖ రాశారు. 

పుల్వామాలో ఉగ్రదాడుల అనంతరం  భారత్‌ వేదికగా జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌ కప్‌లో పాల్గొనాల్సిన ఇద్దరు పాకిస్తాన్‌ షూటర్లు సహా ఓ కోచ్‌కు వీసా ఇచ్చేందుకు భారత ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ఒలింపిక్స్‌కు సంబంధించిన ఏ క్రీడా కార్యక్రమాలకు భారత్‌ ఆతిథ్యం ఇవ్వకుండా అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ నిషేధం విధించింది. భారత ప్రభుత్వం విధానాలను మార్చుకునేంత వరకు ఏ క్రీడలను భారత్‌లో నిర్వహించకూడదని అంతర్జాతీయ సమాఖ్యలను గ్లోబల్‌ ఒలింపిక్‌ బాడీ కోరింది. దీంతో కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సడలించింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.