close

తాజా వార్తలు

కారుతో ఢీకొట్టి.. భార్యపై హత్యాయత్నం!

టంగుటూరు: కట్టుకున్న భార్యపైనే ఓ భర్త సినీ ఫక్కీలో హత్యాయత్నానికి పాల్పడిన దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. టంగుటూరు మండలంలోని తూర్పునాయుడుపాలెం గ్రామ సమీపంలో బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జరుగుమల్లి మండలంలోని కె. బిట్రగుంట గ్రామానికి చెందిన తెదేపా నాయకుడు వి.శివాజీకి తన భార్య శ్రీలతతో గత ఆరునెలలుగా గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో శ్రీలతను హతమార్చేందుకు శివాజీ పథకం వేశాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం శ్రీలత తన బాబాయి పిచ్చయ్య చౌదరితో కలిసి ద్విచక్ర వాహనంపై తూర్పునాయుడుపాలెం నుంచి టంగుటూరు వెళ్తుండగా.. మార్గంమధ్యలో మాటు వేసిన శివాజీ తన కారుతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శ్రీలత, పిచ్చయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వీరిని 108 వాహనంలో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు ఎస్సై హజరతయ్య తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.